ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. జాగ్రత్తగా ఉండాలని సూచన!

పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకోగలిగారు. దీని తర్వాత, సెప్టెంబర్‌లో, ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌పై రైఫిల్‌తో కాల్పులు జరిగాయి.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇంకా పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తాను నమ్మడం లేదని పుతిన్ అన్నారు. మరోవైపు ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు పుతిన్. ట్రంప్ అనుభవజ్ఞుడు, తెలివైన రాజకీయవేత్త అని ఆయన కొనియాడారు. అయితే అతని మీద పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తాను అనుకోవడం లేదని అన్నారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా, జూలైలో పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకోగలిగారు. దీని తర్వాత, సెప్టెంబర్‌లో, ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌పై రైఫిల్‌తో కాల్పులు జరిగాయి. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని కజకిస్థాన్ శిఖరాగ్ర సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ట్రంప్ ఇప్పటికీ సురక్షితంగా లేరని భావిస్తున్నాను అని ఆయన అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా, ట్రంప్ కుటుంబం, పిల్లలపై చేసిన విమర్శలపై పుతిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రష్యాలో ఇటువంటి ప్రవర్తన ఎప్పుడూ జరగదని అన్నారు.

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనే బిడెన్ నిర్ణయానికి సంబంధించి, పుతిన్ ట్రంప్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఇది బహుశా ప్రయత్నం కావచ్చునని అన్నారు. రష్యాతో వారి జీవితాన్ని మరింత కష్టతరం చేయడానికి ఇది ఒక మార్గం. ట్రంప్ పరిష్కారం కనుగొంటారని తనకు నమ్మకం ఉందని, మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రిటైర్డ్ యుఎస్ జనరల్ కీత్ కెల్లాగ్‌ను రష్యా, ఉక్రెయిన్‌లకు ప్రత్యేక రాయబారిగా నామినేట్ చేయడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యాకు ప్రత్యేక రాయబారిగా నామినేట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికైన ప్రెసిడెంట్ కీత్ అద్భుతమైన సైనిక, వ్యాపార వృత్తిని కలిగి ఉన్నారని అన్నారు. అతను మొదటి నుండి తనతో ఉన్నాడని, ఇద్దరం కలిసి అమెరికా, ప్రపంచాన్ని మళ్లీ సురక్షితంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

About Kadam

Check Also

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *