ఈరోజు అనగా 2024, డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటల సమయంలో కోస్టల్ కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల అవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజులు పాటు మధ్య అరేబియా సముద్రం లో కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. …
Read More »Tag Archives: Rains
దడపుట్టిస్తోన్న తుఫాన్.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 27 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 8.5°, తూర్పు రేఖాంశం 82.3°వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీ లంక )కి తూర్పు ఆగ్నేయంగా 120 కి.మీ, నాగపట్టణానికి ఆగ్నేయంగా 370 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 470 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది …
Read More »ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇవాళ, శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. …
Read More »AP Weather: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో భారీ వానలు.. బీ అలర్ట్
ఏపీవాసులకు అలర్ట్.. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని …
Read More »Cyclone Dana: దానా తుఫాను ఎఫెక్ట్.. 4 రోజులపాటు స్కూళ్లకు సెలవులు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా మారనుంది. దీనికి దానా తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక ఈ దానా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే …
Read More »అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ రెండు జిల్లాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం అనంతపురం జిల్లాకు వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున.. ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఓ జ్యువెలరీ షాప్‌కు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే. ఈ జ్యువెలరీ షాపు అనంతపురంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. అయితే ఈ …
Read More »వరదలతో చెన్నై అతలాకుతలం.. ‘హైడ్రా’పై చర్చ
చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడు రాజధానితో పాటు దాని పరిసర జిల్లాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరదలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. 300 ప్రాంతాలు నీట మునిగాయి. సబ్‌వేలల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. కొంత మంది నడుము లోతు నీళ్లలో వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ దారి మూసేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ఈవో శ్యామలరావు.. బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేశారు. టీటీడీ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్న ఈవో.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని …
Read More »ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లోనే.. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. ఏపీలో ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, …
Read More »AP Rains: ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు
గత నెల మెుదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం మెుత్తం నీట మునిగింది. బుడమేరుకు గండి పడటంతో నగరంలో వరదలు వచ్చాయి. వేల కోట్ల నష్టం వాటల్లింది. ఇక గత కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు కురవటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకల్లా ఉపరితల …
Read More »