ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం …
Read More »Tag Archives: chandra babu naidu
ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక ధృవీకరణ పత్రాల అవసరం లేకుండా, వారి స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు పొందే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు. డేటా …
Read More »కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!
అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసింది ఏపీ హోం శాఖ.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలు) ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ముందుగా ఇంగ్లీష్‌లో …
Read More »ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్ వచ్చేశాయ్.. అలా చేస్తే కఠిన చర్యలే..
ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్ వచ్చేశాయ్. నిర్మాణాలకు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు పలు కీలక విషయాలు ప్రస్తావించింది పురపాలకశాఖ. 300 చ.మీ. భూమిలో నిర్మాణాలకు యజమానులే.. ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. పలు మార్గదర్శకాలను పురపాలక శాఖ జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతులపై చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలిచ్చింది. సీఆర్డీఏ …
Read More »మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని.. సూచించారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడానికి సూర్ సిక్స్ హామీలు కూడా ప్రధాన కారణం. ప్రభుత్వంపై దాదాపు రూ. 9లక్షల కోట్ల అప్పుల భారం …
Read More »దావోస్‌లో బిజిబిజీగా గడిపిన సీఎం చంద్రబాబు అండ్ టీమ్.. పెట్టుబడులకు ఆహ్వానం..!
తన అనుభవ సారాన్నంతా ఒడబోసి.. దావోస్ వేదికపై ఏపీ సీఎం చంద్రబాబు ఉనికిని చాటుకుంటున్నారు. తనేంటో ప్రూవ్ చేసుకుంటూ ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ కంపెనీలతోపాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమవుతున్నారు. జన్మభూమి కోసం తోడ్పడాలని ప్రవాసులను కోరారు.ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన విజయవంతంగా ముగిసింది. నాలుగు రోజుల్లో ప్రముఖ సంస్థల అధినేతలు, సీఈవోలు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఏపీ …
Read More »భువనేశ్వరి, బ్రాహ్మణి సంపాదిస్తుంటే.. నేను, లోకేష్ రాజకీయాలు చేస్తున్నాం..
నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. లోకేష్ కూడా రాజకీయాలు చేస్తుంటే బ్రాహ్మణి వ్యాపారాలు చూస్తున్నారంటూ జ్యూరిచ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. నిత్యస్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే..ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదని ఒకటి రెండుసార్లు విఫలం అయినా హెరిటేజ్ స్థాపించి గౌరవంగా ఉన్నాం. నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. …
Read More »సంక్రాంతి పండగవేళ సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సొంత గ్రామంలో సీరియస్
Chandrababu: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం తమ సొంత గ్రామం అయిన తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న చంద్రబాబు కుటుంబం.. నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వివిధ పోటీలు, ఉత్సవాలు చూసేందుకు సీఎం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లెలో 33కేవీ సెమీ …
Read More »తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు పూర్తి నివేదిక.. అందులో ఏముందంటే?
Tirupati Stampede: తిరుపతిలో మృత్యు ఘోష యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెట్ల జారీ కేంద్రం… ఆరుగురిని బలితీసుకుంది. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాటలో 41 మంది గాయపడ్డారు. అయితే స్పాట్‌లో ఏం జరిగింది..? అధికారులు తీసుకున్న చర్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ వెళ్లింది.వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జనవరి 8 బుధవారం ఉదయం బైరాగిపట్టెడ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకూ పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి భక్తుల్ని …
Read More »శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టుతూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటికే ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా, ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ కీలక భూమిక పోషించనున్నాయి. ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ ఎలా పనిచేయబోతున్నాయి …
Read More »