హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాంపస్ అంతా తిరిగి పరిశీలించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. …
Read More »Tag Archives: cm revanth reddy
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి …
Read More »బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…డ్రై పోర్ట్ ఏర్పాటు తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఫోర్త్ …
Read More »ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న సినీ పెద్దలు.. సీఎం ఏమన్నారంటే
సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ చేరుకున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. దిల్‌రాజ్ నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ అయ్యారు . ఇందులో 21 మంది నిర్మాతలు.. 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారుసినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు …
Read More »సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం.. పుట్టిన రోజునే శ్రీకారం..!
సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం …
Read More »మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మనుసులు గెలుచుకున్నారు. తెలంగాణ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేసిన కృషితో పాటు.. భారత్‌లో ఆర్చరీ క్రీడకు తిరుగులేని మద్దతును అందించినందుకు మా నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ …
Read More »సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖపై పరువు నష్టం దావా.. కేటీఆర్ సంచలన నిర్ణయం
KTR on Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు రసవత్తవరంగా మారాయి. హైడ్రా కూల్చివేతలతో పాటు ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. ఈ గొడలన్నింటి మధ్య రైతుల రుణమాఫీ అంశం మరుగున పడిపోతుండటంతో.. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపడుతోంది. ఇటు మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉండటంతో పాటుగానే.. అటు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈరోజు (అక్టోబర్ 05న) రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా …
Read More »హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!
రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి …
Read More »తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్ వర్సిటీ’ శాటిలైట్ సెంటర్.. యువత భవితకు కొత్త బాటలు
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం (భారత కాలమానం ప్రకారం) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. KCR రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం (జులై 29) ఐదో రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4.40 నుంచి 5. 50 వరకు టీ …
Read More »