Tag Archives: amaravati

ఏపీ రాజధాని పక్కనే బ్రహ్మ కైలాసం.! పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి..

పచ్చటి ప్రకృతి రమణీయతకు దగ్గరగా కైలాసాన్ని తలపించే ఈ క్షేత్రం.. బ్రహ్మకైలాసంగా ప్రసిద్ది చెందింది. బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన శివలింగాలపురం కొండ చుట్టూ ఒక గుండ్రటి ఆకారంలో చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండ పైనుంచి ఎటు చూసినా వలయాకారంలో కొండలే కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే…మనం భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా..? అన్న భ్రమలోకి వెళతాము. అందుకే దీన్ని బ్రహ్మ కైలాసంగా భావిస్తారు. ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న …

Read More »

భవిష్యత్తు అమరావతికి తొలి అడుగు.. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం, రాజకీయ విమర్శలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటి మధ్య ఆయన రాజధాని అభివృద్ధి కోసం కొనసాగించిన కృషి ప్రశంసలకు పాత్రమైంది. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదన్న విమర్శ తరచూ గట్టిగా వినిపిస్తూ వచ్చేది. ఈ విమర్శలకు సీఎం చంద్రబాబు ఇప్పుడు చెక్ పెట్టారు. త్వరలో సీఎం చంద్రబాబు ఇంటి చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా లింగమేనని అతిథిగృహంలో ఉంటున్న …

Read More »

అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు?.. ఎన్ని ఎకరాలంటే, కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు.. చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్‌ ప్లాట్‌‌గా చెబుతున్నారు.. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్‌ 25 వేల చదరపు గజాలు కాగా.. ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉందని. అలాగే …

Read More »

అమరావతి ఊపిరి పీల్చుకో.. రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చకచకా గాడిలో పడుతున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులను పున:ప్రారంభించేందుకు సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 11,467 కోట్ల మేర రాజధానిలో నిర్మాణ ప‌నులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సీఆర్డీఏ 41వ అథారిటీ స‌మావేశంలో ఆ మేరకు కీలక  నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 23 అంశాల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ‌రావ‌తి విష‌యంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. సీఎం …

Read More »

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..

ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన …

Read More »

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనకే అవకాశం.. చీఫ్ విప్ పదవి ఎవరికంటే, జనసేన నుంచి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. శాసనమండలి, శాసనసభల్లో చీఫ్‌ విప్‌ల పేర్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం ముందు అక్కడ విప్‌ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని చెబుతున్నారు.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు …

Read More »

హడ్కో నిర్ణయంతో అమరావతికి మహర్దశ.. ఏకంగా రూ.11వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. . రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏకు రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి నారాయణ ఢిల్లీలో హౌసింగ్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) సీఎండీని కలిశారు. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వివరించగా.. రూ.11వేల కోట్ల ఈ రుణానికి సంబంధించి హడ్కో ఛైర్మన్, సీఎండీ (మేనేజింగ్‌ డైరెక్టర్‌) సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ హామీ ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. మరో రూ. 165 కోట్ల రుణం విడుదలకూ …

Read More »

ఏపీలో వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ మొత్తం కట్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమంటూ కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ప్రకటించారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ ఈ అదనపు …

Read More »

ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఏకంగా రూ.10 లక్షలు, వడ్డీ కూడా ఉండదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించారు. ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ …

Read More »

మళ్లీ తెరపైకి ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్‌ పర్సన్‌‌గా కోర్టులో పిటిషనర్‌ పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ హోదా హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని.. ఏపీ ఆర్థికంగా పునరుజ్జీవం పొందేందుకు కేంద్రం నుంచి …

Read More »