నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు చేస్తే బతుకుతుందనే ఆశతో చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చిలో భవ్యశ్రీతో ప్రార్థనలు చేయిస్తూ వచ్చారు. సుమారు 40 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే భవ్యశ్రీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి కన్నుమూసింది. దీంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని.. ఆస్పత్రికి వెళ్లకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. …
Read More »Tag Archives: crime news
ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..
ఆమె పేరు రమాదేవి.. సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది. వెంకట్రావుకి వివాహమై ఇద్దరూ పిల్లలున్నారు. రమాదేవి, వెంకట్రావులకు పెళ్లై పిల్లలున్నా వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దాదాపు ఇరవై ఏళ్ల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంక్‌లో తాకట్టు పెట్టించింది. అయితే ఇద్దరూ మధ్య ఎటువంటి …
Read More »ఒక్కడిని చేసి దాడి.. కట్ చేస్తే.. ప్రమాదం జరిగి ఒళ్లంతా గాయాలు.. అంతా కర్మ ఫలితమేనా!
సత్కర్మభీశ్చ సత్ఫలితం.. దుష్కర్మ ఏవ దుష్ఫలం.. అత్యుత్కట పుణ్యపాపానాం సత్యంబలానుభవమిహం.. పురాణాల్లో ఉన్న శ్లోకమిది. మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితమూ, చెడ్డ పనులు చేయడం వల్ల చెడు ఫలితమూ వస్తాయని.. ఏదైనా మనం చేసిన దాని ఫలితాన్ని అనుభవించాల్సిందేనని చెప్పేదే కర్మ సిద్ధాంతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ కథనం, ఫోటోలు, వీడియోలు చూస్తే.. కర్మ సిద్ధాంతం నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయికి మెసేజ్ చేశాడనే …
Read More »హైదరాబాద్‌లో భారీ స్కామ్.. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి నిండా ముంచేశారు
రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి ఓ సంస్థ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కూకట్‌పల్లి కేంద్రంగా ఓ సంస్థ వ్యాపారం ప్రారంభించింది. తమ కంపెనీలో 8 లక్షల 8 వేలు పెట్టి రెండు గుంటల స్థలం కొంటే.. ప్రతి నెలా 4 శాతం చొప్పున రూ.32 వేలు తిరిగి చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ …
Read More »కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు..!
ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడుతున్న యువత సర్వం కోల్పోతున్న సంగతి తెలిసిందే. లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతున్న కొందరు డబ్బులు పోగొట్టుకోవటమే కాదు.. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించాలనే దురశాతో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి చిత్తవుతున్నారు. కొందరు సోషలో మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా ప్రలోభపెడుతున్నారు. అటువంటి వీడియోనే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఓ యువకుడు తక్కువ సమయంలోనే ఈజీగా …
Read More »Cyber Crime: రూ.1.22 కోట్లు పోగొట్టుకున్న ప్రైవేటు ఉద్యోగి.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. రకరకాల పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకొని చాలా ఈజీగా దోచేస్తున్నారు. సామాన్యుల అత్యాశను పెట్టుబడిగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. మెున్నటి వరకు ఈ కేవైసీ, గిఫ్ట్ కార్డులు, లక్కీ డ్రాలు, డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో చాలా మంది యువత, ఉద్యోగులు ట్రేడింగ్ వైపు మెుగ్గు చూపుతుండటంతో అటుగా వారి ఫోకస్ పడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పాఠాలు, చిట్కాలు, పెట్టుబడులు అంటూ చాలా ఈజీగా మోసాలు చేస్తున్నారు. …
Read More »కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!
Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …
Read More »నెల్లూరులో పరువు హత్య కలకలం.. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌కాల్‌తో, మిస్సింగ్ కేసు హత్యకేసుగా!
నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టి కూతురు కనిపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ మిస్టరీ వీడింది. చివరికి మిస్సింగ్ కాస్తా హత్యకేసుగా మారింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన ఘటన కలకలంరేపింది. కొడవలూరు మండలం పద్మనాభునిసత్రం పల్లిపాలెంకు చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో …
Read More »ఇంత అమానుషమా.. 20 వేల కోసం సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి..!
ప్రస్తుత సమాజం చాలా కమర్షియల్‌గా మారిపోయింది. ఎంతగా అంటే.. డబ్బుల కోసం సొంతవాళ్లను కూడా దూరం చేసుకునేంత. రక్తసంబంధానికి కూడా విలువ లేకుండాపోతోంది. దూరం చేసుకుంటే పర్లేదు కానీ.. అందరి ముందు అవమానించి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి.. తలదించుకునేలా చేయటమే శోచనీయం. అలాంటి అమానుష ఘటనే జరిగింది సిద్దిపేటలో. ఇచ్చిన అప్పులో కొంత మొత్తం తిరిగి ఇవ్వలేదన్న కోపంతో.. సొంత అన్నావదినపై దాడి చేయటమే కాకుండా.. వీధిలోకి లాగి ఆలయానికి కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. నాసర్‌పూర్‌కి చెందిన పరిశురాములు తన అవసరాల నిమిత్తం.. తన …
Read More »ఏపీ ప్రజలకు అలర్ట్.. పథకం ప్రారంభం కాక ముందే ఇదేం తలనొప్పి.. జాగ్రత్తగా ఉండండి
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను …
Read More »