World

Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు..

అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్‌లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌ వెలుపల అక్రమంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున …

Read More »

Amazon: ఆఫర్ల జాతర.. అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్ మరో ఆకర్షణీయమైన సేల్‌తో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లభిస్తున్న ఆఫర్లు ఏంటి.? ఏయే వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్స్‌ లభించనున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..బ్లాక ఫ్రైడే సేల్‌ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. షాపింగ్‌ సీజన్‌ ప్రారంభానికి సూచికగా ఏటా బ్లాక్‌ ఫ్రైడే్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్‌ను భారత్‌లోనూ …

Read More »

Heart Attack: యువతలో గుండెపోటు ఎందుకు పెరుగుతోంది..? నిపుణుల షాకింగ్‌ విషయాలు!

మారుతున్న జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం లైఫ్‌ స్టైల్‌ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుండెపోటు ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి. యువకులను సైతం వదలడం లేదు. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సెలబ్రెటీలు, క్రికెట్‌ ప్లేయర్లు దీనిబారిన పడుతున్నారు. తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు …

Read More »

చలికాలంలో రోజుకెన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా..? చాలా మంది చేసే పొరబాటు అదే

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది తగినంతగా నీళ్లు తాగరు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, ఈ కాలంలోచలికాలం మొదలైంది. చలిగాలుల కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది నీళ్లు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ శీతాకాలంలో కూడా శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుచేత చలి కాలంలో తీసుకునే ఆహారం నుంచి మనం తాగే నీటి …

Read More »

ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. జాగ్రత్తగా ఉండాలని సూచన!

పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకోగలిగారు. దీని తర్వాత, సెప్టెంబర్‌లో, ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌పై రైఫిల్‌తో కాల్పులు జరిగాయి.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇంకా పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తాను నమ్మడం లేదని పుతిన్ అన్నారు. మరోవైపు ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు పుతిన్. ట్రంప్ అనుభవజ్ఞుడు, తెలివైన రాజకీయవేత్త అని ఆయన కొనియాడారు. అయితే …

Read More »

‘ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో నిరుద్యోగ రేటు చాలా తక్కువ’.. కేంద్ర మంత్రి వెల్లడి

దేశంలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభకు తెలియజేశారు. 2023-24లో భారతదేశంలో యువత నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా ఉందని, ఈ రేటు ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువగా ఉంది పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 25న లోక్‌సభలో మంత్రి శోభా కరంద్లాజే రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి, నిరుద్యోగ గణాంకాల వివరాలు వెల్లడిస్తూ.. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) మన దేశంలో ఉపాధి, నిరుద్యోగ యువతకు …

Read More »

ఆకర్షిస్తున్న ఆ ఈవీ స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్.. ధరెంతో తెలిస్తే షాక్..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకు తమ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీని అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్లోని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రివర్ ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. రివర్ ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్ ధర ఇప్పుడు రూ.1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). …

Read More »

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

Urvil Patel: ఉర్విల్ పటేల్ గుజరాత్‌కు చెందిన క్రికెటర్. 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎంపికైన ఈ యువ స్ట్రైకర్‌కు ఆడే అవకాశం రాలేదు. అలాగే, ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన 26 ఏళ్ల ఉర్విన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత తుఫాన్ సెంచరీతో ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలను పశ్చత్తాపడేలా చేశాడు. దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును …

Read More »

PM Modi: ప్రధాని మోడీ వికసిత్ భారత్‌లో భాగమవ్వండి.. యువతకు పిలుపునిచ్చిన పీవీ సింధు, ఆయుష్మాన్ ఖురానా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన వికసిత్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగమయ్యారు. ఈ మేరకు వికసిత్ భారత్ ఛాలెంజ్ లో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారీ స్టార్ సెలబ్రిటీలుజాతీయ యువజనోత్సవం -2025 ను పురస్కరించుకుని ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో …

Read More »

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఫిక్స్..! ఫ్రాంఛైజీల రిటెన్షన్ డెడ్‌లైన్ అదే.. రూల్స్‌పై ఉత్కంఠ!

భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి కూడా క్రికెట్ అభిమానులకు.. ఐపీఎల్‌పై అత్యంత ఆసక్తి ఉంటుంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌.. ఇటు బీసీసీఐకి.. అటు ఆటగాళ్లపై కాసులు కురిపిస్తుందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్‌కు ఉంది. ఫ్రాంఛైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఇంకా ఉత్కంఠకరంగా సాగుతుంది. గత సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలోనే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా …

Read More »