Tag Archives: ktr

మేము తలుచుకుంటే వారి పేర్లు, విగ్రహాలు ఉండేవా? రాహుల్‌కు కేటీఆర్ ఘాటు లేఖ..

చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని ఆయన విమర్శించారుతెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కరి మీద మరొక్కరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదం ముగియక ముందే మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై …

Read More »

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది.అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది.  అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి …

Read More »

కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మరో పోరాటం చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సాధనకు కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తట్టిలేపేలా.. అప్పటి ఉద్యమాన్ని గుర్తుతెచ్చేలా… ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టేలా… రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్‌ ఎలా జరిగింది…? కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఎక్కుపెట్టిన బాణాలేంటి…?తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తా… కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యా… ఇవి తరుచూ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు.. ఇక ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ఫుల్‌ సీరియస్‌గా తీసుకుంది. ఎప్పటికప్పుడు రేవంత్‌ కామెంట్స్‌కి కౌంటర్లు ఇస్తూనే… …

Read More »

నేను కూడా పంపిస్తా.. కాచుకో.. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు. “కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు …

Read More »

మంత్రి కొండా సురేఖ వివాదం.. కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు

ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టే రాజకీయం నడుస్తోంది. అయితే.. ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైంది. గురువారం (అక్టోబర్ 03న) రోజు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు.. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ …

Read More »

ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు:కొండా సురేఖ

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం (అక్టోబర్ 2) చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆమె అక్కినేని నాగార్జున కుటుంబం, హీరోయిన్ సమంత పేరు తెరపైకి తీసుకొచ్చారు. వారి వ్యకిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న సురేఖ.. మరో మహిళపై ఇటువంటి కామెంట్స్ …

Read More »

బాబు చిట్టీ.. అక్కడ మార్కులు పడ్డాయిగా.. ఇక ఇక్కడ దృష్టి పెట్టు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇటీవల రాజీవ్ గాంధీ విగ్రహం ఇలా పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల పర్వం నడుస్తోంది. కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో ఏకంగా 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు ప్రాణాలు వదిలినట్టు ఉన్న రిపోర్టులపై వాడీ వేడిగా చర్చ నడుస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్.. తప్పుడు లెక్కలు చెప్తోందని.. అసలు మరణాల సంఖ్యను దాచిపెడుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. …

Read More »

జీతం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే.. ఉద్యోగం నుంచి తీసేశారు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే సీఎం రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు మెుర పెట్టుకుంటున్నారు. ఇలాగే ఓ మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కూడా తన జీతం విషయంపై ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే జీతం విషయం దేవుడెరుగు ఉద్యోగమే తీసేశారని సదరు మహిళ వాపోయింది …

Read More »

కోల్‌కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని డిమాండ్.. దటీజ్ కేసీఆర్: కేటీఆర్

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యంత అమానుష ఘటనపై దేశమంతా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయం చేయాలంటూ.. వైద్య విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని.. మిగతా రాష్ట్రాల వైద్య విద్యార్థులు డిమాండ్ …

Read More »

కేటీఆర్, హరీష్ సహా BRS ఎమ్మెల్యేలు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ ముందు ఆందోళన చేపట్టగా.. అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు. బుధవారం (జులై 31) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని .. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ …

Read More »