Heart Attack: యువతలో గుండెపోటు ఎందుకు పెరుగుతోంది..? నిపుణుల షాకింగ్‌ విషయాలు!

మారుతున్న జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం లైఫ్‌ స్టైల్‌ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుండెపోటు ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి. యువకులను సైతం వదలడం లేదు. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సెలబ్రెటీలు, క్రికెట్‌ ప్లేయర్లు దీనిబారిన పడుతున్నారు. తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచరులకు చెబుతూ కుప్పకూలాడు. అయితే గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. ఇలా యువతలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. దాని నుండి రక్షించువడం ఎలా అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

  1. ఒత్తిడి: బాధ్యతల బారం లేదా ఇతర కారణాల వల్ల, ఎవరైనా ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరిగితే అది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. దీంతో చాలా మంది యువతలో ఒత్తిడి కారణంగా గుండెపోటు వస్తుంది.
  2. ఆహారం: ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలా మంది యువత తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. చాలా సార్లు ప్రజలు బయటి నుంచి జంక్ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక బీపీ, ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  3. జీవనశైలి: నేటి యువతలో చాలా మంది జీవనశైలి చాలా చెడిపోయింది. సరైన సమయంలో నిద్రపోకపోవడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బిజీ షెడ్యూల్ కారణంగా యువత తమ జీవనశైలిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అయితే ఈ పొరపాటు మిమ్మల్ని గుండెపోటు పేషెంట్‌గా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నివారించేందుకు మార్గాలు:

చురుకుగా ఉండండి: మీరు ఎంత బిజీగా ఉన్న చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంట్లోనే ఉండి వ్యాయమం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసికంగా కూడా ప్రశాంతతను అందిస్తుంది. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినండి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినండి, ఎక్కువ నీరు తాగండి. బయటి ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

About Kadam

Check Also

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *