Horoscope Today: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.8.51 వరకు, తదుపరి అష్టమినక్షత్రం: పుబ్బ తె.4.46 వరకు(తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.11.21 నుండి 1.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.41 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: రా.9.54 నుండి 11.40 వరకు.

మేషం: శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు సన్మానాలు.

వృషభం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.

మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. అరుదైన సన్మానాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు. విందువినోదాలు.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. బంధువులతో అకారణంగా తగాదాలు.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. విద్య, ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విందువినోదాలు.

కన్య: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధన వ్యయం. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి..

తుల: పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన విద్యావకాశాలు.

ధనుస్సు: అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా లేనిపోని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాల కోసం యత్నాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

కుంభం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుస్తాయి. దైవచింతన.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం.

About amaravatinews

Check Also

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి.. చూసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం

కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. తిరుమలలో అనేక పవిత్ర ఉత్సవాలు జరుగుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *