Recent Posts

భవనం కూల్చివేశారు సరే.. మా భవిష్యత్తేంటి? గచ్చిబౌలి ఘటనలో ట్విస్ట్

గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో నాలుగంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒకపక్కకు ఒరిగి భయాందోళన సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇదిలా ఉండగా.. భవనం పక్కన గుంతలు తవ్వి పక్కకు ఒరగడానికి కారణమైన బిల్డర్‌పై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్‌ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. …

Read More »

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి స్వస్తి పలికింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది.. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు (ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల …

Read More »

మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా, శిక్షించాల్సిందే.. ఏపీ హైకోర్టు సీరియస్

గుంటూరు మేయర్, వైఎస్సార్‌సీపీ నేత కావటి మనోహర్‌నాయుడిపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్‌ వంటి పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని.. అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. ఏ పార్టీ వారైనా సరే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. …

Read More »