Tag Archives: nara lokesh

చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు

ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్‌ టైమ్‌ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300009 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు.. 161 రకాల ప్రజలు సేవలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, APSRTC, అన్న క్యాంటీన్, …

Read More »

మనసంతా విశాఖపైనే.. చంద్రబాబు సర్కార్ ఫుల్ పోకస్.. మూడు దశల్లో రూ.84,700 కోట్లు..

స్టీల్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇంకోవైపు మనసంతా విశాఖే అని చాటుకుంటోంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరాన్ని.. అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.మొన్న టీసీఎస్‌.. నిన్న గూగుల్‌తో ఎంవోయూ.. ఇంకోవైపు పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు. హెచ్‌పీసీఎల్‌, ఎన్టీపీసీ హైడ్రో పవర్‌ లాంటి వాటిలో లక్షల కోట్ల పెట్టుబడులు. వీటితో పాటు టూరిజం, ఫార్మా అన్ని రకాలుగా విశాఖకు పెద్దపీట వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. …

Read More »

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు.. ప్రతి రోజూ కాలేజీల్లో ఉచితంగా, మంత్రి లోకేష్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో …

Read More »

ఆపదొస్తే, ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా.. పెద్ద తప్పు చేశావు తమ్ముడు: మంత్రి లోకేష్ ఎమోషనల్

టీడీపీ కార్యకర్త, తనకు అభిమాని శ్రీను మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను.. తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ బాధపడ్డారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను.. శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ …

Read More »

మంత్రి నారాలోకేశ్‌ను కలిసిన మంచు విష్ణు.. కారణమేమిటంటే?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (నవంబర్ 30) వీరిద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీతో పాటు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. అనంతరం నారా లోకేశ్ తో భేటీకి సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు మంచు …

Read More »

తుని ఆర్టీసీ డ్రైవర్‌కు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్.. మరో బంపరాఫర్ ఇచ్చారు

కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే ఈ …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్‌ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఈ అంశంపై …

Read More »

తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …

Read More »

ఏపీ మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు రద్దు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు, లోకేష్ ఐడియా అదుర్స్

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విజయవాడలో వరద విలయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారుల పర్యటన, వరద సహాయక చర్యలను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల, ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమయ్యారు. వరద సహాయకచర్యలు, బాధితులకు భోజనం అందించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు …

Read More »

ఏపీలోకి ఫాక్స్‌కాన్!.. నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల చర్చలు

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా …

Read More »