Uncategorized

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో పెంపుడు కుక్క హత్యకు గురైన ఘటన మరువక ముందే.. ఓ పెంపుడు కుక్కను పైశాచికంగా కొట్టిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది.. మూగ జీవి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు.. విచక్షణ కోల్పోయి మరి కర్రతో ఎలా పడితే అలా కొట్టాడు.. వివరాల్లోకెళితే.. స్కావెంజర్స్ కాలనీలో లావణ్య అనే మహిళకు చెందిన పెంపుడు …

Read More »

తెలంగాణవాసులకు బిగ్ అప్డేట్.. సర్పంచ్ ఎన్నికలు జరిగేది అప్పుడే.. ఇక ఊళ్లలో పండగే..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంబురానికి సమయం ఆసన్నమైంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడో అప్పుడో ఎప్పుడో అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయినట్టుగా మరోసారి వార్తలు వస్తున్నాయి. కాగా.. పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే …

Read More »

ఏపీలో మద్యం షాపుల నడుపుతున్నవారికి షాక్.. లైసెన్సులు రద్దు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మద్యం షాపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఎమ్మార్పీపై కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా వదిలేది లేదని హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయంలో గనులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు.. ఇసుక లభ్యత, సరఫరా, మద్యం ధరలపై చర్చించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించే, బెల్ట్‌ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటి తప్పు కింద రూ.5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. ఒకవేళ ఆ తర్వాత కూడా మళ్లీ అవే తప్పులు …

Read More »

అన్న క్యాంటీన్ల కోసం పెద్ద మనసుతో.. వారికి బంపరాఫర్, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించబోతున్నారు. దీని కోసం అన్న క్యాంటీన్‌ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్ పేరుతో ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు

సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్‌ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల నుంచి పక్కా, చాలా తక్కువ ధరకే

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును తక్కువ ధరకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు కేజీ రూ.180 ఉండగా.. రైతు బజార్లలో ఇప్పటికే కందిపప్పు కౌంటర్లు తెరచి కిలో రూ.110కే అందిస్తున్నారు. అయితే నవంబర్ నెల నుంచి కందిపప్పు, పంచదారను బియ్యంతో పాటుగా పంపిణీ చేయనున్నారు. రెండు నెలల కిత్రం దీని కోసం టెండర్లు పిలవగా.. గత నెల నుంచి గోడౌన్‌లకు చేరుతోంది. నవంబరులలో రేషన్‌కార్డులు …

Read More »

బోరుగడ్డ అనిల్ అరెస్ట్ వ్యవహారం.. హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్‌ మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనిల్ అరెస్ట్ విషయంలో కులం ప్రస్తావన తీసుకువస్తుండటాన్ని వంగలపూడి అనిత తప్పుబట్టారు. “డాక్టర్ సుధాకర్‍ను రోడ్డు మీద కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేస్తే.. అతని అవమానం తట్టుకోలేక చనిపోయారు. వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు. ఇవన్నీ జరిగినప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని ఎందుకు రోడ్డు మీదకు రాలేదు.ఇప్పుడు దళిత కార్డు బయటికి తీసుకు వస్తున్న వారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? దళితురాలైన నన్ను సీఎం చంద్రబాబు గారు.. హోం …

Read More »

బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మీ ఖాతా అడ్రస్ మార్చారా? చూసుకోండి మరి

Banking: బ్యాంక్ అకౌంట్ తీసుకున్ని సంవత్సరాలు గడుస్తుంటుంది. కొందరికి ఒకటికి మించి అకౌంట్లు ఉంటాయి. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా చిరునామా మారినప్పటికీ బ్యాంక్ ఖాతాలో మాత్రం పాత అడ్రస్ కొనసాగిస్తుంటారు. ఇలా చేయడం పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. మీరు చిరునామా మారినప్పుడల్లా బ్యాంక్ అకౌంట్‌లోనూ వివరాలను అప్డేట్ చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంక్ అకౌంట్ కీలకమైనది. ఇందులో మన అడ్రస్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలనూ ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. …

Read More »

ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందే, రిలీవ్ చేయనున్న తెలంగాణ

కేంద్రం ఇటీవల బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, వాణీప్రసాద్, హరి కిరణ్, శివశంకర్, సృజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం …

Read More »

ముంబయి- న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన …

Read More »