తెలంగాణవాసులకు బిగ్ అప్డేట్.. సర్పంచ్ ఎన్నికలు జరిగేది అప్పుడే.. ఇక ఊళ్లలో పండగే..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంబురానికి సమయం ఆసన్నమైంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడో అప్పుడో ఎప్పుడో అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయినట్టుగా మరోసారి వార్తలు వస్తున్నాయి. కాగా.. పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే బరిలోకి దిగేలా కన్పిస్తోంది.

అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కులగణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ఈ నెల 6వ తేదీన ప్రారంభించగా.. నవంబర్ 30తో ముగియనుంది. కాగా.. ఈ కులగణన సర్వే రిపోర్టును వీలైనంత త్వరగా తయారు చేయాలని సర్కార్ యోచిస్తోంది. కాగా.. డిసెంబర్ మెదటి రెండు వారాల్లోనే రిపోర్టు సిద్ధం కానుందని.. ఆ రిపోర్టు ఆధారంగానే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేయనుంది. దీంతో.. కొత్త రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే.. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందని.. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోందన్న చర్చ జోరుగా జరుగుతోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు రాత్రి కల్లా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో.. జనవరిలో సంకాంత్రితో పాటు సర్పంచ్ ఎన్నికల సంబురం కూడా రానుంది.

About amaravatinews

Check Also

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..

చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *