అన్న క్యాంటీన్ల కోసం పెద్ద మనసుతో.. వారికి బంపరాఫర్, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించబోతున్నారు. దీని కోసం అన్న క్యాంటీన్‌ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్ పేరుతో ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభమవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు.. పలువురు ముందుకు రావడంతో దీన్ని ఛారిటబుల్‌ ట్రస్టుగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది.. ట్రస్టు రిజిస్ట్రేషన్‌ చేయించి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొదటిదశలో 100 అన్నక్యాంటీన్లలో పేదలకు భోజనం (మూడు పూటలకూ కలిపి) అందించేందుకు విడివిడిగా దాతల నుంచి విరాళాలు సేకరించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వంద క్యాంటీన్లలో టిఫిన్‌కు రూ.5.95 లక్షలు, మధ్యాహ్న భోజనానికి రూ.10.15 లక్షలు, రాత్రి భోజనానికి రూ.10.15 లక్షలు చొప్పున విరాళాలు సేకరించనున్నారు. మూడు పూటలకూ కలిపి రూ.26.25 లక్షలు కావాలి.. ఈ విరాళాలు ఇచ్చేవారికి ఆన్‌లైన్‌లోనే రసీదులు కూడా ఇవ్వనున్నారు. ఇలా విరాళాలు ఇచ్చి ఆదాయపన్ను మినహాయంపు పొందొచ్చు.. దాతల వివరాలు క్యాంటీన్లలో స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. రాష్ట్రంలో ప్రారంభించిన అన్నక్యాంటీన్లు 204 కాగా.. ఇప్పటివరకు మొత్తం 60,39,520 టోకెన్లు జారీ చేశారు. టిఫిన్ 22,37,623, మధ్యాహ్న భోజనం 23,42,447, రాత్రి భోజనం 14,59,450 టోకెన్లు ఇచ్చారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న అన్నక్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 204 క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో మూడుపూటలా కలిపి రోజూ 1.50 లక్షల మందికిపైగా భోజనం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం రోజూ రూ.కోటికిపైగా రాయితీ కింద ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో.. ఒక్కొక్కరికి మూడు పూటలా భోజనం ఖర్చు రూ.90 కాగా.. ఇందులో రూ.15 వసూలు చేస్తూ, మిగిలిన రూ.75 ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది.

About amaravatinews

Check Also

తెలంగాణవాసులకు బిగ్ అప్డేట్.. సర్పంచ్ ఎన్నికలు జరిగేది అప్పుడే.. ఇక ఊళ్లలో పండగే..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంబురానికి సమయం ఆసన్నమైంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ.. పంచాయతీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *