ఏపీ ప్రజలకు అలర్ట్.. పథకం ప్రారంభం కాక ముందే ఇదేం తలనొప్పి.. జాగ్రత్తగా ఉండండి

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. తాను …

Read More »

వినేశ్ ఫోగట్ అంశంపై చర్చకు నిరాకరణ.. పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్

ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. …

Read More »

హసీనాకు రక్షణగా రఫేల్ జెట్లు పంపి.. విమానానికి భద్రత కల్పించిన భారత్‌

రిజర్వేషన్ల కోటాపై గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనించి భారత్‌.. సోమవారం తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్‌ హసీనా (sheikh Hasina ) పదవి నుంచి తప్పుకోవడంతో మరింత అప్రమత్తమైంది. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సైన్యం 45 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఆమె భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్లు …

Read More »

డిప్యూటీ సీఎం గారి విజ్ఞప్తి.. ఇక నుంచి వారంలో ఒక్కరోజైనా ఆ పని చేయండి

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి వారంలో ఒక్క రోజైనా ప్రజలు.. చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉపముఖ్యమంత్రి.. ప్రజలకు ఈ సూచన చేశారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని హితవు పలికారు. జాతీయ చేనేత …

Read More »

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేలు, ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికి శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైఎస్సార్‌సీపీ సర్కారు రద్దు చేసింది అన్నారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని.. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా …

Read More »

 ‘మీకల, నా ధైర్యం రెండూ ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై!’ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం

ప్యారీస్‌ ఒలంపిక్స్‌ 2024లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. వినేశ్‌ ట్వీట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read More »

వారు వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 8, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి ఊరట లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారిని ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగం విషయంలో ఆశించిన మంచి సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ …

Read More »

హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేయండి.. నిర్మలా సీతారామన్ సమాధానం ఇదే!

GST on Insurance: గత కొన్ని రోజులుగా జీఎస్టీపై తీవ్ర చర్చ జరుగుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. …

Read More »

రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగింది? లక్షల్లో జీతం తీసుకునే కోచ్‌లు ఏం చేస్తున్నారు?

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ఫైనల్‌ చేరిన వినేష్‌ ఫొగాట్‌ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళ రెజ్లింగ్‌ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్‌ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్‌ ఆడకుండా అనర్హత వేటు విధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్‌ ఫొగాట్‌కు మద్దతు ప్రకటించారు. రౌండ్‌ 16, క్వారర్స్‌, సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు ముందు వినేష్‌ ఫొగాట్‌ బరువు …

Read More »

భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం.. 27 ఏళ్ల తర్వాత సిరీస్‌ కోల్పోయిన భారత్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ కాంబోలో ఆడిన తొలి వన్డే సిరీస్‌ను భారత్‌ కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో 0-2తో భారత్‌ ఓడిపోయింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 110 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది. బ్యాటర్ల వైఫల్యంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ గెలవలేకపోయింది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఇక ఆ నిబంధన తొలగించిన సర్కార్

Local Body Elections: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎంతో మందికి స్థానిక …

Read More »

ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌.. స్మార్ట్‌టీవీలు, Apple iPhone, Google, Samsung ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు

Flipkart Flagship Sale 2024 : స్వాతంత్య్రదినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లాగ్‌షిప్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు ఈ Flagship Sale ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్‌ ఉత్పత్తులపై …

Read More »

ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ.. తక్కువ ధరకే లిక్కర్

AP Cabinet: ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు.. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఇక ఇదే మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీకి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి వివరించారు. కొత్త మద్యం పాలసీ, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ.. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను …

Read More »

పలాసలో వింత దొంగలు.. ప్రభుత్వ ఆఫీస్‌లో ఇదేం పని, ఏం చేశారో తెలిస్తే!

శ్రీకాకుళం జిల్లా పలాసలో విచిత్రమైన ఘటన జరిగింది. స్థానిక గ్రామీణ నీటిపారుదల విభాగం పాత కార్యాలయంలో చోరీ కలకలంరేపింది. ఈ దొంగతనంలో పలు ఫైల్స్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ కార్యాలయం వెనుక ఉండే కిటికీ తొలగించిన దొంగలు.. లోపలికి చొరబడ్డారు. దస్త్రాలను మూటలు కట్టి తుక్కు షాపులో దొంగలు అమ్మేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా స్క్రాప్ షాప్‌లోని మూటలను గుర్తించారు. ఈ విషయం ఇంజినీరింగ్‌ అధికారులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి అధికారులు …

Read More »

రూపే క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త.. మరిన్ని రివార్డ్ పాయింట్లు.. యూపీఐ లావాదేవీలపైనా..!

Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. అందులో యూపీఐ ట్రాన్సాక్షన్ల వాటానే అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్లు చేసేందుకు రూపే క్రెడిట్ కార్డులకు అవకాశం కల్పించింది కేంద్రం. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు ఎన్‌పీసీఐ కీలక సూచన చేసింది. ఇతర కార్డు లావాదేవీలపై అందించే రివార్డు పాయింట్లు, ఇతర బెనిఫిట్స్ రూపే క్రెడిట్ కార్డులకు అందించాలని స్పష్టం చేసింది. …

Read More »