Tag Archives: deputy cm pawan kalyan

ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆరు నెలలలోపే నేరవేర్చుకున్నారు. పిఠాపురంలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. …

Read More »

 సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చంతా వాటిపైనే..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకొచ్చినట్లు సమాచారం.. అంతే కాకుండా తాజా రాజకీయ పరిణామాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. కాకినాడలో రేషన్‌ బియ్యం మాఫియా పైనా సీఎం, …

Read More »

ఆ రెండు ఖరీదైన BMW కార్లు ఎక్కడ.. ఆరా తీసిన పవన్ కళ్యాణ్, అధికారుల సమాధానం ఏంటో తెలిస్తే!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా.. అవి మాయం అయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా.. ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం.. ఎవరి దగ్గర ఉంది.. …

Read More »

పవన్ కళ్యాణ్‌కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో వాలంటీర్ల ట్విస్ట్, కోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట దక్కింది. ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పవన్‌ కళ్యాణ్ గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారని ఎన్టీఆర్, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రత్యేక …

Read More »

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే

సరస్వతి పవర్ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలోని సరస్వతి భూములలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. అటవీశాఖ దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి, ఎఫ్‌బిఓ వెంకటేశ్వరరావు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మాచవరం, చెన్నైపాలెం, వేమవరం గ్రామాల్లో జీపీఎస్ సర్వే చేశారు. అటవీ భూములు ఏమైనా సరస్వతి పవర్ భూముల్లో కలిశాయా అనే విషయమై సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను …

Read More »

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం.. తెరపైకి పవన్ కళ్యాణ్ సంచలన డిమాండ్

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన ట్వీట్‌పై పవన్ స్పందించారు. ఈ లడ్డూ ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని.. వైఎస్సార్‌‌సీపీలో హయాంలో ఉన్న టీటీడీ పాలకమండలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం దారుణమని.. ఇది అందరి మనోభావాలనూ దెబ్బతీసిందన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. …

Read More »