ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ రూట్ మార్చింది. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. అంతేకాదు పార్టీ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షుల్ని నియమించారు. అంతేకాదు ఆయా జిల్లాల్లో నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను కూడా మారుస్తున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చేశారు. మాజీ మంత్రి విడదల రజినికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, చిలకలూరిపేట నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ కొత్త సమన్వయకర్తలను నియమించింది. తాడికొండలో …
Read More »