రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. CLI స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని చెప్పారు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో IT సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ …

Read More »

ఆపరేషన్ మహాదేవ్‌లో బయటపడిన చైనా రహస్యం.. ఆ పరికరంతో పాక్‌కు సహాయం

ఈ పరికరాన్ని అల్ట్రా సెట్ అని పిలుస్తారు. ఇది అధునాతనమైన సురక్షితమైన చైనీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ. దీనిని పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తుంది. ఇది GSM లేదా CDMA నెట్‌వర్క్‌లపై పనిచేయదు. కానీ రేడియో తరంగాలపై పనిచేస్తుంది.  సోమవారం భారత సైన్యం పారా కమాండోలు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్‌లో భారీ విజయాన్ని సాధించారు. జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం ఉంది. ఈ ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు సులేమాన్ అలియాస్ ఆసిఫ్. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన …

Read More »

అప్పటి వరకు పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వదలం..! పార్లమెంట్‌ సాక్షిగా..

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పులను మోదీ ప్రభుత్వం సరిదిద్దుతుందని, రక్తం, నీరు కలిసి ప్రవహించవని ఆయన పేర్కొన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాకిస్థాన​్‌ తన మద్దతు నిలిపివేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తామని బుధవారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. సింధూ …

Read More »

ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత..

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఈ అక్రమ సంబంధాలు చివరకు దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలో కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిపై.. భర్త కత్తులతో దాడి చేసిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగబోయిన రవి, లావణ్యలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు …

Read More »

టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్ అభినందనీయం.. మంత్రి కొండా సురేఖ

TV9 సీడ్‌బాల్ కార్యక్రమాన్ని తాజాగా గుమ్మడివల్లి ఫారెస్ట్‌ ఏరియాలో చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. టీవీ9 సీడ్ బాల్ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తొడ్పడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీవీ9 నెట్‌వర్క్ సీడ్ బాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పచ్చదనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సీడ్‌బాల్ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు.. పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగిస్తోంది టీవీ9 నెట్‌వర్క్.. …

Read More »

నిండా సరుకుతో హైవేపై దూసుకొచ్చిన కారు.. ఇంతలో పుష్ప మాదిరి ట్విస్ట్.. చివరకు జరిగిందిదే..

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియా.. ఓ బొలెరో వాహనం దూసుకొస్తుంది.. బొలెరో వాహనం నిండా ఏవోవో సరుకుల బస్తాలున్నాయి.. పోలీసులకు ఏదో అనుమానం కలిగింది.. దీంతో వారిని ఆపారు.. కానీ.. వాహనంలో ఉన్న వారు టెన్షన్ తో వాహనం స్పీడును మరింత పెంచారు.. అలా వాహనం స్పీడుగా ఉన్న క్రమంలోనే.. బొలెరో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు వారిని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో సినీ ఫక్కీలో గంజాయి …

Read More »

అక్కను చంపే ముందు రీల్స్ చేసిన రోహిత్‌… షాద్‌నగర్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు

ఫేమస్‌ అవ్వాలంటే హత్యలు కూడా చేస్తారా? అది కూడా సొంత వాళ్లకు చంపేందుకు కూడా వెనుకాడరా? షాద్‌నగర్‌ హత్య కేసులో ఇప్పుడే ఇదే విషయం సంచలనం రేపుతోంది. షాద్‌నగర్ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను ఆమె తమ్ముడు రోహిత్‌ హత్య చేసినట్టు తెలుస్తోంది. అక్కను చంపే ముందు రీల్స్ చేశాడు రోహిత్‌. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు… బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ రీల్స్ చేశాడు. దీంతో హత్య చేసేందుకు ముందుగానే …

Read More »

నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడి…క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల..ఎన్ని గేట్లు ఎత్తారంటే..

నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కృష్ణా పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలకల సంతరించుకుంది. దీంతో 26 క్రస్ట్ గేట్ల మీదుగాకృష్ణమ్మ జాలువారుతోంది. కృష్ణవేణి జల సవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా…? ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్ లోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే నిండాయి. జూలైలో ముందస్తుగా ఆల్మట్టి నుండి శ్రీశైలం వరకు అన్ని జలాశయాలు …

Read More »

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..

బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్లున్నారు..! బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్ట్‌ 5 నుంచి …

Read More »

ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. నాగార్జున సాగర్ వెళ్లకుండా సైడ్‌ అయిన మంత్రి కోమటిరెడ్డి

నేను ఏమైనా ఆయనకు సబ్‌ ఆర్డినేట్‌ నా? ఆయన ఎన్నిగంటలు ఆలస్యంగా వచ్చినా ఎదురు చూడలా..? నేనూ మంత్రినే.. నాక్కూడా ఆత్మగౌరవం ఉంది. కనీసం లేట్‌గా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం నాగార్జునసాగర్ పర్యటన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోపం వచ్చింది. ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. అంటూ ఇంటికి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నేను ఏమైనా ఆయనకు సబ్‌ ఆర్డినేట్‌ నా? ఆయన ఎన్నిగంటలు …

Read More »

ఈడీ ముందుకు నటుడు ప్రకాశ్‌రాజ్‌… బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో విచారణకు హాజరు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో వదల బొమ్మాళీ అంటూ ఈడీ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ, రానా, ప్రకాష్‌రాజ్‌, మంచులక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈడీ ముందు హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఫోకస్‌ చేసింది. మొత్తం 36 బెట్టింగ్‌ యాప్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్‌పై సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఓ …

Read More »

అమరావతి క్వాంటం వ్యాలీకి సింగపూర్‌ కంపెనీల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ …

Read More »

ఈ యువతకు ఏమైంది..? గుండె లయ తప్పడానికి కారణాలు ఇవేనా..?

ఇటీవల ఉప్పల్‌లో ఓ యువకుడు బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనికి కారణం అతడికి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కావడమే. సికింద్రాబాద్‌కు చెందిన 24ఏళ్ల యువకుడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఇటీవల గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇక్కడా గుండెపోటే కారణం. ఇలా ఇటీవల చాలామంది యువకులు ముఖ్యంగా 30 ఏళ్లలోపే గుండెపోటుకు గురవుతున్నారు. వీటన్నిటికీ కారణాలేంటి? ఈ యువత గుండెకు ఏమైంది. అంత వీక్‌గా మనోళ్లు ఉన్నారా? అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం కానున్నాయి. తమ దగ్గరికి వచ్చే గుండె జబ్బు బాధితుల్లో యువకులే …

Read More »

గండికోట రహస్యం.. విద్యార్థిని హత్య జరిగి 18 రోజులు.. తాజా అప్ డేట్స్ ఇవి..!

గండికోట రహస్య వీడేదెప్పుడు? ఇంటర్ స్టూడెంట్ వైష్ణవి హత్య జరిగి 18రోజులైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. కోట చుట్టూ కొండ చుట్టూ కలియతిరుగుతున్నారు. బట్.. ఎలుకను కూడా పట్టుకోలేకపోతున్నారు. ఎందుకిలా? అసలీ కేసును పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారా? అందులో భాగంగానే సాగ దీస్తున్నారా? టెక్నాలజీ మీద భారం వేసి చేతులెత్తేస్తారా? కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో వైష్ణవి హత్యకు గురయింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈనెల 14న జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కి చేరుకుని మృతదేహాన్ని …

Read More »

అమెరికాలో ఉద్యోగం అనగానే లక్షలు అప్పజెప్పారు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఉద్యోగాల పేరుతో ఎంతో మంది లక్షలు కాజేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం దాన్ని నమ్మి యువత పైసలు కట్టడం.. ఆ తర్వాత మోసపోయామని తెలిసి లబోదిబో అనడం. చివరకు పోలీసులను ఆశ్రయించడం. ఇటువంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా మోసగాళ్ల మాటలకు ఇంకా చాలా మంది బలవుతూనే ఉన్నారు. ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగం అది అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మి ముగ్గురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. వారి వద్ద నుండి రూ.37 లక్షలను వసూలు చేశారు. ఆ …

Read More »