ముంబై దాడుల సూత్రధారి.. గ్లోబల్ టెర్రరిస్ట్‌.. అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి!

ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బావ, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్‌. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.

మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. మక్కీ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి డిప్యూటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. హఫీజ్ మహ్మద్ సయీద్‌కు హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ దగ్గర బంధువు. అందుతున్న సమాచారం ప్రకారం, మక్కీ మరణానికి గుండెపోటు కారణమని చెబుతున్నారు. 2023 సంవత్సరంలో, ఐక్యరాజ్యసమితి మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అతని ఆస్తులను జప్తు చేసింది. దీంతోపాటు మక్కీపై ప్రయాణ, ఆయుధాలపై ఆంక్షలు విధించారు.

హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం(డిసెంబర్ 27) గుండెపోటుతో మరణించాడు. అతను ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బావ, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. జమాత్-ఉద్-దవా (JUD) ప్రకారం, అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక మధుమేహంతో చికిత్స పొందుతున్నాడు. మక్కీ ఆరోగ్యం విషమించి ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

JUD చీఫ్ హఫీజ్ సయీద్ బావ మక్కీకి 2020లో తీవ్రవాద నిధుల కేసులో పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద నిధుల కేసులో శిక్ష పడిన తర్వాత మక్కీ తన కార్యకలాపాలను తగ్గించుకున్నాడు. మక్కీ పాకిస్థాన్ భావజాలానికి మద్దతుదారు అని పాకిస్థాన్ ముతాహిదా ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది.

About Kadam

Check Also

హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *