చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది.. శారీరకంగా ఓదార్పునిస్తుంది. ఈ క్రమంలో మీరు, బీపీ లేదా హార్ట్ పేషెంట్ అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.చలి విజృంభిస్తోంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అయితే, శీతాకాలంలో స్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం చాలా సౌకర్యవంతమైన ఎంపిక.. ఈ అలవాటు శారీరక సౌఖ్యాన్ని అందించడమే కాకుండా మానసిక …
Read More »Pan Card 2.0: పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
అసలేంటి PAN 2.O ప్రాజెక్ట్?మొదటిసారిగా పర్మినెంట్ అకౌంట్ నెంబర్ PAN నుంచి 1972లో ఇన్ కమ్ ట్యాక్స్ చట్టాల్లోని సెక్షన్ 139A కింద పరిచయం చేశారు. ఇది పన్ను చెల్లించే వారి కోసం ఏర్పాటు చేసిన ఒక పర్మినెంట్ అకౌంట్. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ, వ్యయాలను లెక్క చూపేందుకు ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన నెంబర్ ఇది. వాళ్లు చేసే ఎటువంటి లావాదేవీలైనా ఈ నెంబర్ ఆధారంగానే చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయం దాదాపు ట్యాక్స్ పేయర్స్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు …
Read More »అబ్బో.. పోలీసుల సన్మానం మామూలుగా లేదుగా! ఖాకీలతో పూలదండలు, మర్యాదలంటే మాటలా..
ఎవరైనా కొత్తగా కొన్న బైకులో లేదా కారులో గాయపడిన వారిని, ప్రమాదంలో ఉన్న వారిని ఎక్కించుకుని తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు. కానీ ఈ ఇద్దరు యువకులు మాత్రం ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కాపాడటం కంటే శుభం ఇంకేం ఉంటుందని భావించారు. అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తమ కొత్త వాహనంలో రక్తమోడుతున్న బాధితుడిని ఎక్కించుకుని హుటాహుటీన ఆస్పత్రికి చేర్చారు. అక్కడే ఉన్న పోలీసులు యువకుల ఔదార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే వారిని ఘన సత్కారం చేశారు..స్టేషన్‌లో పోలీసులు సన్మానం చేశారంటే ఎవరిమైనా ఏమనుకుంటాం.. …
Read More »ప్రాణాలు తీస్తున్న ట్రావెల్స్ బస్సులు.. రెప్పపాటులో ఘోరం.. ఆటోలో వెళ్తుండగా..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా వెళ్లాలనే ఆత్రుతో లేక ప్రమాదం జరిగితే మాకేమవుతుందిలే అనే అహంకారమో.. తెలియదు గానీ బస్ డ్రైవర్లు అధిక స్పీడ్‌తో బస్సులను నడిపి ఆటోలను ద్విచక్ర వాహనాలను గుద్దేసుకుంటూ నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పోరుమామిళ్ల కాలువ కట్ట సమీపంలో ఆటోను …
Read More »ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే చుక్కలు చూడాల్సిందే.. ఎక్కడంటే
అదో చిన్న గ్రామం. కానీ వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. గ్రామం అంత కలిసి ఓకే మాటమీద 12 సంవత్సరాలుగా ఉండడం అంత ఆశమాషీ వ్యవహారం కాదు. వాళ్ల నిర్ణయం వల్ల చాలా వరకు గొడవలు తగ్గాయి. ఇంతకీ అది ఏ గ్రామం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలియాలి అంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. మెదక్ జిల్లా అల్లదుర్గ్ మండలంలోని కాగిదంపల్లి గ్రామం గత కొన్ని రోజులుగా ఆ గ్రామం ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది..గత 12 ఏళ్లుగా ఈ …
Read More »మరో పరువు హత్య.. కానిస్టేబుల్‌ను దారుణంగా నరికి చంపిన తమ్ముడు..
తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణ కలకలం రేపుతోంది.. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్ నాగమణిని తమ్ముడు పరమేష్ నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి.. సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్ బయల్దేరింది.. ఈ క్రమంలో నాగమణి కోసం దారికాచిన తమ్ముడు …
Read More »అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? తల్లడిల్లిన కన్నపేగు
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకు.. నిండా ఐదేళ్లు కూడా నిండని పసి మొగ్గ.. ఆ తల్లి కళ్ల ముందే లారీ చక్కాల కింద చిద్రమైపోయాడు. అక్కడికక్కడే బిడ్డ ప్రాణాలు వదిలడం చూసిన ఆతల్లి.. ఇంత ఘోరం చూశాక తన ప్రాణం ఎందుకు పోలేదా? అని గుండెలవిసేలా రోదించింది.. దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది కరుణలేని విధి. వచ్చీరాని మాటలతో తప్పటడుగులు వేస్తూ తమ కళ్లముందు తిరుగుతూ సందడి చేసిన తన గారాల పట్టి.. చూస్తుండగానే అశువులు బాయడం చూసిన …
Read More »CAT 2024 Result Date: క్యాట్ 2024 ‘కీ’ విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2024.. నవంబర్ 24న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం 170 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష ఆన్సర్ కీ డిసెంబర్ 3న విడుదలకానుంది. అభ్యంతరాలు డిసెంబర్ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు లేదా వచ్చే ఏడాది జనవరి …
Read More »ఫోన్ కొట్టు.. పల్స్ పట్టు.. ఇకపై అలా నడవాల్సిందే.. చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు..
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నది ఆ నిర్ణయం. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే సేవలలో మార్పులు, కొనసాగించాలని ముఖ్యమంత్రి తాజా ఆదేశాలిచ్చారు.. మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అందుకు ఐవిఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని సూచించారట. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని, నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని …
Read More »స్కూల్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీఈ మార్కుల విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే
రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మూల్యాంకన విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీసీఈ మార్కుల్లో విద్యాశాఖ మార్పులు చేసి.. కొత్త విధానాన్ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నూతన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో మార్కుల విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ క్రమంలో గతంలో ఉన్న విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. గతంలో రాత పరీక్షకు 20 మార్కులు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 35 మార్కులకు మార్చింది. ఫార్మెటివ్ …
Read More »ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా
టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్ అవుతారు. …
Read More »ఆపదొస్తే, ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా.. పెద్ద తప్పు చేశావు తమ్ముడు: మంత్రి లోకేష్ ఎమోషనల్
టీడీపీ కార్యకర్త, తనకు అభిమాని శ్రీను మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను.. తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ బాధపడ్డారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను.. శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ …
Read More »తిరుమల అన్నప్రసాద కేంద్రంలో కియోస్క్ మెషిన్.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు, సింపుల్‌గా!
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మెషిన్‌ను సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా …
Read More »తిరుమల ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో అరుపులు, కేకలు.. భయపడిపోయిన భక్తులు
తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు రెచ్చిపోయారు. తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో కార్ డోర్ తీసి సన్‌రూఫ్, సైడ్ విండోల నుంచి బయటకు నిలబడి పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశారు. వర్షంలో యువకులు కారులో బయటకు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు.. దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. యువకుల చేష్టలు చూసి వాహనాల్లో వెళుతున్న భక్తులు అవాక్కయ్యారు.. ఈ యువకుల ఆగడాలను రికార్డ్ చేశారు. ఘాట్ రోడ్డులో హంగామా చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »Horoscope Today: ఆదాయ ప్రయత్నాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 2, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. మిథున రాశి నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల్లో మార్పులు జరిగే …
Read More »