ధరణి ఓ అద్భుతం అన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనిపించింది. ధరణిని సెట్‌రైట్ చేస్తున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి.. భూభారతి ఎలా ఉండబోతోంది? ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం లభిస్తుందా?ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య …
Read More »అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..
అమరావతి పునఃనిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన అనుమతులపై …
Read More »తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ
భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన “దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి”కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారంగా ప్రసిద్దిగాంచిన …
Read More »వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. ఇంట్లో కనిపించిన నీళ్ల బిందెను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా ఇంటి అవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.మనం దొంగతనాలు గురించి వింటూ ఉంటాం..! మనం కూడా కొన్ని సందర్భాల్లో బాధితులమే.. రకరకాల దొంగతనాలు చూసి ఉంటాం. ఈ విచిత్ర దొంగతనం కొంచెం కామెడీగా ఉంది. కానీ నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో విచిత్ర దొంగతనం జరిగింది. స్థానికుల …
Read More »తెలంగాణ టెట్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. ఏయే తేదీలో ఏ పరీక్ష ఉంటుందంటే
తెలంగాణ టెట్ పరీక్షలు మరో 14 రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 20 సెషన్లలో రోజుకు రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. నార్మలైజేషన్ లేకుండా జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది..తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 (డిసెంబర్) పరీక్షల షెడ్యూల్ తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు …
Read More »డా బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఈ అర్హతలుంటే చాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ డిగ్రీలో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ కోర్సులో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 21వ తేదీలోగా..హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల …
Read More »భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త కనిపించడం లేదంటూ 50 రోజుల క్రితం చేసిన ఫిర్యాదు ఎట్టకేలకు మర్డర్ కేసుగా మారింది. దృశ్యం సినిమాను తలపించేలా దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. వివరాల్లోకి వెళితే హత్యకు గురైన ప్రభాకర్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట కు చెందిన ప్రభాకర్ పదేళ్ల క్రితం ఎలక్ట్రిషన్ పనుల కోసం శ్రీకాళహస్తికి వచ్చాడు. కొత్తపేటలో ఉన్న స్నేహితుడి తో కలిసి అద్దెలో ఉంటున్నాడు. పనులేని రోజుల్లో ఇంటికి వెళుతూ వస్తున్న ప్రభాకర్‌కు శ్రీకాళహస్తిలో …
Read More »మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.. బాలుడికి మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర మంత్రి ఆనం రాంనారయణరెడ్డి స్పందించారు. జిల్లాలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.కరోనా మహమ్మారి తర్వాత ఏ వైరస్ పేరు విన్నా వెన్నులో వణుకు పుడుతోంది. ఆమధ్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జీకా వైరస్ బెడద తప్పిందని అనుకుంటుండగా మరోసారి భయం మొదలైంది. నెల్లూరు జిల్లాలో …
Read More »నీట్ యూజీ 2025 కొత్త సిలబస్ వచ్చేసింది.. సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలివే..
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్స సిలబస్ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారాదేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) సిలబస్ …
Read More »నర్సింగ్ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి.. ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కాలేజీల్లో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా ప్రవేశాలు కల్పించాలని కోరుతూ ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో పలువురు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీంద్ర నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఇందులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కళాశాలల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ కోరింది. ఈ సంఘం ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు డిసెంబరు 17న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీంద్ర …
Read More »TG CETs 2025: ఆ 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు.. ఇకపై ఐసెట్ బాధ్యతలు MGUకి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఉన్నత విద్యా మండలి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది..తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఈసెట్, …
Read More »కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీమ్‌లకు రేషన్ కార్డు లింక్ ఉంది. దీంతో వీటి కోసం నిరీక్షిస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ షురూ అవుతుందన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల …
Read More »అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. బుధవారం, గురువారం, శుక్రవారం వాతావరణ పరిస్థితుల గురించి అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగ ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది మరింత తీవ్రత చెంది అదే ప్రాంతంలో …
Read More »అయ్యా బాబోయ్.. ఈ కోడిపుంజు ధర రూ.2లక్షలు.. ఎక్కడో తెలుసా?
వసంతంలో కోకిల గానం, పురి విప్పి నెమలి చేసే నాట్యం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు, అప్పుడూ అందరూ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తుంటారు.. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల హడావుడి అంతా ఇంతా కాదు. మరి ఈ సారి కోడిపుంజులు ధర ఎంత ఉందో తెలుసా? అక్షరాలా రూ.2లక్షలు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. పండుగ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు హడావుడి మొదలైంది. ఇప్పటికే రకరకాల పుంజులతో కోడిపందాలకు సిద్ధమవుతున్నారు. కోడి …
Read More »ఎవడ్రా బాబూ.. ఇంత మోసగాడిగా ఉన్నావు.. బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..!
అనంతపురంలోని రాంనగర్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ధన్వి హోండా షోరూం ఎండీ కవినాధ్ రెడ్డిని మాట్లాడుతున్నానని బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి చెప్పాడు. ప్రస్తుతం తాను హాస్పటల్లో ఉన్నానని.. అర్జెంటుగా 9 లక్షల 50 వేల రూపాయల చెక్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు.ఇప్పుడు మీరు చూడబోయేది ఆన్లైన్ మోసాల్లో ఇది కొత్త రకం మోసం.. మీ బ్యాంకు వివరాలు.. ఓటిపి ఎవరు అడిగినా ఇవ్వొద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంక్… ఓ సైబర్ నేరగాడి …
Read More »