ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకం తీసుకువచ్చింది. పిల్లల చదువుకు, వారి పోషణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు సహాయం చేస్తున్నాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక, ఇప్పటికే మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు అందించారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అనాథ పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర …
Read More »TimeLine Layout
September, 2025
-
13 September
ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఈ అర్హతలుంటే చాలు
వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కేవలం విద్యార్హతల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు ఎంపిక.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 213 అడిషనల్ …
Read More » -
13 September
జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి.. అమరావతిని కలుపుతూ రైల్వే శాఖ అదిరే ప్లాన్..
దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ సర్వే నిర్వహిస్తోంది. బుల్లెట్ రైలుతో హైదరాబాద్ – చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుంది. ప్రస్తుతం 12గంటల సమయం పడుతోంది. దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి …
Read More » -
13 September
‘నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షను వాయిదా వేయండి..’ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ
దక్షిణాది రాష్ట్రాల్లో పీజీ మెడికల్ 2022 విద్యార్థులకు తుది పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షను ఒకటి, రెండు నెలలపాటు వాయిదా వేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో పీజీ మెడికల్ 2022 విద్యార్థులకు తుది పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షను …
Read More » -
13 September
అయేషామీరా హత్య కేసులో వీడని మిస్టరీ.. 18 ఏళ్లుగా దక్కని న్యాయం!
18 ఏళ్లుగా అయేషామీరా హత్య కేసు కోర్టులో నానుతూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో న్యాయం మరింత ఆలస్య మవుతుంది. ఈ కేసును CBIకి అప్పగించినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిలిపోయే పరిస్థితి నెలకొంది.. గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న అయేషామీరా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం నెలకొంది. 2007 డిసెంబర్ 27న రాత్రి లేడీస్ హాస్టల్‌లో విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడిగా …
Read More » -
13 September
ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్..! అక్టోబర్ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1 నుండి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు. పల్లెల్లో చాలా మందికి కష్టకాలంలో ఆదుకునే పనిగా, కరువు పనిగా, మట్టిపనిగా పేరు తెచ్చుకున్న ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో కొంతమంది ఒకరి …
Read More » -
12 September
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..? అసలు నిజం తెలిస్తే అవాక్కే..
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యపు అలవాట్లే ఈ సమస్యలకు ప్రధాని కారణమని వైద్యులు అంటున్నారు. అయితే కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని నమ్ముతారు. మరి ఇది నిజమేనా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్ల గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనే నమ్మకం చాలామందిలో ఉంది. కిడ్నీలో రాళ్లను వైద్య పరిభాషలో నెఫ్రోలిథియాసిస్ అంటారు. ఇవి సాధారణంగా మూత్రపిండాల లోపల చిన్న …
Read More » -
12 September
తులసి వేర్లతో కషాయం..ఇలా వాడితే ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..!
తులసి ఆకులు, సారం జలుబు, దగ్గుకు మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుందని దాదాపు మనందరికీ తెలుసు. అయితే, తులసి ఆకులు, గింజలు మాత్రమే కాదు..తులసి వేర్లు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తులసి వేర్లతో కషాయం చేసి ఉపయోగిస్తే లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం… తులసి మొక్క లేని ఇల్లు చాలా అరుదు. మతపరమైన కారణాల వల్లనే కాకుండా దాని ఔషధ గుణాల కారణంగా కూడా ప్రతి ఇంట్లోనూ తులసి …
Read More » -
12 September
మరో గుడ్‌న్యూస్ ప్రకటించిన కేంద్రం.. మరింత చేరువగా చౌకైన జనరిక్ మందుల దుకాణాలు..!
ప్రస్తుతం ప్రధాన నగరాలకే పరిమితమైన జనరిక్ మందుల దుకాణాల పరిధి పెరుగుతోంది. కొత్త జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి కనీస దూరం అనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 దుకాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. జన ఔషధి కేంద్రాల్లో జనరిక్ మందులు 90 శాతం వరకు తక్కువ ధరలకు లభిస్తాయి. మెట్రో నగరాలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో కొత్త సరసమైన ధరలకు జన ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి కనీస దూర నియమాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు …
Read More » -
12 September
నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనూ GHMC సేవలు!
హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇకపై ప్రజలు ఆఫీస్ వరకు రాకుండానే ఇంట్లోనే తమ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారా తమ సమస్యలపై ఫిర్యాదులు చేయడం, పన్నులు చెల్లించేలా సరికొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వాట్సప్ చాట్‌బాట్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్న ఆ చాట్‌బాట్ క్లియర్ చేసేలా దాన్ని రూపొందించనున్నారు. పెరుగున్న టెక్నాలజీని వినియోగించుకోవలంలో మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని జీహెచ్‌ఎంసీ అధికారులు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal