కొరుకుడుపడని కొయ్యగా మారిన దేశ రాజధాని.. ఈసారైనా కమలనాథుల కల నెరవేరేనా..?

భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మూడు దశాబ్దాలుగా అధికారం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కలిసి పోటీ చేసినా సరే క్లీన్ స్వీప్ చేసిన కమలదళం అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చతికిలపడుతోంది. చివరిసారిగా 1993లో గెలుపొందిన ఆ పార్టీ, మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా …

Read More »

రోడ్డు ప్రమాదంతో గాయపడి మృతి చెందిన గోవును చూసి, ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

రోడ్డు ప్రమాదంతో చనిపోయిన గోవును చూసి గ్రామం మొత్తం చలించిపోయింది. మృతదేహానికి సంప్రదాయబద్ధంగా ఊరంతా కలిసి ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.సొంత వాళ్లు చనిపోతే కూడా పట్టించుకోని ఈ రోజుల్లో.. రోడ్డు మీద వదిలేస్తున్న చాలా మందిని చూస్తున్నాం. నిత్యం తమ కళ్ళ ముందు తిరిగాడే మూగ జీవి రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందింది. ఆ మూగ జీవికి మనుషుల మాదిరిగా గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు చేశారు. సంప్రదాయబద్ధంగా దానికి ఊరంతా కలిసి ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని …

Read More »

హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!

ఆరేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో చలి పులి విజృంభిస్తుంది. ఓ వైపు చలితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు నానాటికీ పడిపోతున్న గాలినాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో జనజీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఆదివారం సిటీలో దాదాపు 300 AQI నమైదైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి గాలి నాణ్యత కాస్త కోలుకుంది..హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్పపీడన ప్రభావంతో ఉదయం, రాత్రి వేళల్లో చలిపంజా విసురుతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలితీవ్ర వల్ల …

Read More »

మరోసారి భాగ్యనగరంలో గుప్పుమన్న మత్తు మందు.. రూ. కోటి 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా మాత్రం ఆగడంలేదు. తాజాగా మీర్‌పేట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడడం కలకలం రేపుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 53 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా రక్షణ స్వాధీనం చేసుకున్నారు ఎల్బీనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు. మీర్‌పేట్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా …

Read More »

తెలంగాణలో హరిత విప్లవం దిశగా కీలక అడుగులు.. సీఎం రేవంత్‌ సర్కార్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయ్యింది. స్వరాష్ట్రంలో పదేళ్లుగా ఎదురే లేద‌నుకున్న గులాబి పార్టీని ఓడించి, తెలంగాణ‌కు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అంతే దూకుడుగా రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారుతోన్న వాతావరణ మార్పులను అధిగమించేందుకు రేవంత్‌ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ …

Read More »

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు.. డిప్యూటీ సీఎం భట్టి

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి కూడా సర్కార్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విభాగాలు, శాఖల్లో ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి.. ఆ ప్రకారంగానే టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. …

Read More »

 తొలిరోజు గ్రూప్‌ 2 పరీక్షకు భారీగా డుమ్మా.. 46.30 శాతం మంది మాత్రమే హాజరు!

ఎన్నో సంవత్సరాల తర్వాత భారీగా కొలువుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష తొలిరోజు కనీసం సగం మంది కూడా పరీక్షకు హాజరుకాకవపోవడం చర్చణీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్ 2 పోస్టులకు తీవ్ర పోటీ ఉంటుంది. దరఖాస్తులు ఐదున్నర లక్షలు వచ్చినా.. వీరిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం విశేషం.. తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే రాతపరీక్షలు డిసెంబరు 15న ప్రారంభమవగా.. డిసెంబర్‌ 16వ తేదీతో …

Read More »

ఛీ.. ఛీ.. వీళ్ళు బంధువులా? లేక రాబందువులా? తల్లి అని కనికరం లేకుండా..

కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని కలచి వేస్తుంది. నవ మాసాలు మోసి కనిపించిన ఆ తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కారులో తీసుకువచ్చి రోడ్డుపై వదిలేసి వెళ్లారు.వృద్ధులైన తల్లిదండ్రులను కొందరు మూర్ఖులు భారంగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన వారిని కూడా అనాధలుగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాల్సిన వారే తల్లిదండ్రుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన …

Read More »

నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..

సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లుమోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి హద్దే లేదు… ఈ మధ్యకాలంలో మోసపోయిన తర్వాత గాని ఇలా కూడా మోసం చేస్తారా అనేలా ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న మోసాలు …

Read More »

అయ్యోపాపం..స్కూల్ కు వెళ్తున్న టీచర్ ను కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి..!

అతడు స్కూల్ కు వెళ్తుండగా కొంత మంది వ్యక్తులు రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చి అతడిని అడ్డుకున్నారు. గన్స్ తో బెదిరించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి అతడిని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ గుంజన్ అనే మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. బలవంతంగా వివాహం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఉదయాన్నే స్కూల్‌కి వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కి వెళ్తున్న టీచర్‌ని కొందరు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. తుపాకులతో బెదిరించి …

Read More »

దసలి పట్టు అంటే ఏంటి? దానికి ఎందుకంత క్రేజ్ ?

శతాబ్దాల చరిత్ర కలిగిన పట్టు.. దేవాది దేవతలకు మాత్రమే పరిమితమైన పట్టు.. ఆనాడు నిజాంను మంత్రముగ్దున్ని చేసి నేడు మగువల మనసులనూ కనికట్టు చేస్తోంది. ప్రాణహిత గోదావరి తీరం వెంట పుట్టిన ఈ పట్టు.. నేడు ఫ్యాషన్‌ ప్రపంచాన్నీ ఓ పట్టు పడుతోంది.ఆదివాసీ ఖిల్లాలో అరుదైన పరిశ్రమగా.. శ్రమే ఆయుదంగా సాగిస్తున్న ఈ పంట గిరిజ‌న రైతుల పాలిట కల్పతరువుగా మారుతోంది. ఇంకాస్త ప్రభుత్వాల ప్రోత్సాహం అదనమైతే ఈ పట్టు తెలంగాణ వస్త్రరాజంగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. ఇంతకీ ఏంటా పట్టు కథ అంటారా.. …

Read More »

దంచికొట్టిన మాజీ కేంద్రమంత్రి.. పాలిటిక్స్‌లోకి కాకుండా క్రికెట్‌లోకి వస్తే కథ వేరే ఉండు..

Anurag Thakur: లోక్‌సభ స్పీకర్ ఎలెవన్, రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 111 పరుగులు చేసి జట్టును 73 పరుగుల తేడాతో విజయతీరాలకు చేర్చాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో అనురాగ్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.టీబీకి వ్యతిరేకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాగుర్ సెంచరీ చేశారు. లోక్‌సభ స్పీకర్ XI, రాజ్యసభ ఛైర్మన్ XI జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. ఇందులో లోక్‌సభ …

Read More »

ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను కడతేర్చిన సోదరి..

వ్యసనాలకు బానిసయ్యారు.. తండ్రి డబ్బులు కోసం కుస్తీ పడ్డారు. ఒకరిపై మరొకరికి అనుమానం పెరిగిపోయింది. దీంతో ఆస్తిని దక్కించుకునే క్రమంలో అన్నదమ్ముల్నే ఏకంగా హత్య చేసింది ఒక సోదరి… ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది.మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. మారిపోతున్న మానవీయ విలువల గురించి ఈ పాటను మనం తరచూ గుర్తుచేసుకుంటుంటాం.. నిజంగా.. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.. ఆధునిక కాలంలో మనుషులంతా మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసే వారు.. …

Read More »

ఆత్మలపై రుణాలు.. ఇదేంటని రికవరీ ఏజెంట్లు ఇంటికి వెళ్లగా.. బయటపడ్డ విస్తుపోయే నిజాలు

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాగే జరిగింది ఓ ఫైనాన్స్ కంపెనీలో.. అదునుగా భావించిన ఓ ఘరానా ఉద్యోగి పని చేస్తున్న కంపెనీనే బురిడీ కొట్టించాడు. లోన్‌ల పేరిట ఏకంగా ఆరు కోట్లకు టోకరా పెట్టేసి పరారయ్యాడు.అలా‌ ఇలా కాదు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద హౌస్ లోన్లు తీసుకొని.. వాటికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇటు‌ పని చేస్తున్న సంస్థను అటు నమ్మిన స్నేహితులను ఆ ఘనుడు నట్టెట్ట ముంచేశాడ. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా …

Read More »

‘దేశం కోసం మోడీ మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు’.. ప్రధానిపై దేవర విలన్ ప్రశంసలు

దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శత జయంతిని పురస్కరించుకుని కపూర్ ఫ్యామిలీ ఇటీవల ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిసింది. కరీనా, సైఫ్, రణ్ బీర్ ,అలియా, కరిష్మా.. ఇలా అందరూ ప్రధానితో భేటీ అయ్యారు. తాజాగా ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను దేవర విలన్ సైఫ్ అలీఖాన్ అందరితో పంచుకున్నారు.దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. ఇందుకోసం ఇటీవలే కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి …

Read More »