కొన్ని సూచనలు.. ఇంకొన్ని సలహాలు.. మరికొన్ని బాధ్యతలు గుర్తుచేస్తూ మొదటి రోజు కొనసాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోవాలని ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం..గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బియ్యం మాఫియా పెరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇకపై ఏ జిల్లాలో అయినా బియ్యం, గంజాయ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు.. సీఎం చంద్రబాబు ఆదేశించారు.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని.. ఇందుకోసం …
Read More »ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. 2 నెలల్లో అంత తాగేశారా, ఆదాయం ఏకంగా వేల కోట్లలో!
AP Liquor Sales Record: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రికాస్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపుల్లో రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 16 నుంచి 3,396 …
Read More »తిరుమలలో ప్రతి టీటీడీ ఉద్యోగికి ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్.. భక్తుల కోసం కీలక నిర్ణయం
Tirumala Name Badge System: టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఛైర్మన్ బీఆర్ నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులతో కొందరు టీటీడీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగులు భక్తుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు. ఈ మేరకు ఈ సరికొత్త నిర్ణయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ …
Read More »చిన్నారి ప్రాణం తీసిన మూఢనమ్మకం.. నెల్లూరు జిల్లాలో విషాదం
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు చేస్తే బతుకుతుందనే ఆశతో చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చిలో భవ్యశ్రీతో ప్రార్థనలు చేయిస్తూ వచ్చారు. సుమారు 40 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే భవ్యశ్రీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి కన్నుమూసింది. దీంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని.. ఆస్పత్రికి వెళ్లకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. …
Read More »Free Gas Cylinders Scheme: దీపం 2 పథకానికి భారీ రెస్పాన్స్.. ఎంతమందికి డబ్బులు జమ చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అపూర్వమైన స్పందన వస్తోంది. ఈ పథకం ప్రారంభించి 42 రోజులు కాగా.. ఈ 42 రోజుల్లో 80 లక్షలకు పైగా సిలిండర్ బుకింగ్స్ జరిగాయి. ఇందులో 62 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. వీరిలో 97 శాతం మందికి నగదును బ్యాంక్ ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి ఉచిత గ్యా్స్ సిలిండర్ బుకింగ్ కోసం 2025 మార్చి 31 వరకూ అవకాశం ఉంది. నాలుగు …
Read More »ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే..
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది.. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు..కోవిడ్19 మహమ్మారి రెండేళ్ల పాటు విలయతాండవం చేసింది.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు …
Read More »అల్పపీడనం ఎఫెక్ట్.. ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతంలో నున్న నిన్నటి బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం.. శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది.. దీంతోపాటు అనుబంధి ఉపరితల ఆవర్తనం మధ్య-ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉంది.. ఈ బాగా గుర్తించబడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే …
Read More »చలికాలంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అసలు చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఏమిటి..? చలికాలంలోనే అది కూడా తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణం ఏమిటి..? ఎండాకాలం, వానాకాలంతో పోల్చితే చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తున్నాయి. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్తప్రవాహం తగ్గి గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. రక్తపీడనం ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదముంది. అధిక శారీరక శ్రమ, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలు, తదితర కారణమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. చలిలో …
Read More »ఏపీకి త్వరలో కొత్త డీజీపీ..! రేసులో ఎవరెవరు ఉన్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకావం ముమ్మరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు సర్వీస్ ఈ నెల చివరి నాటికి ముగియనుంది. అయితే ఆయన సర్వీస్ పొడిగింపు ఉంటుందా? లేదా? అనే దానిపేఐ క్లారిటీ లేదు. ఒకవేళ రిటైర్ మెంట్ తీసుకుంటే తర్వాత ఆ పోస్టులో ఎవరుంటారనే దానిపై చర్చసాగుతుంది..కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం …
Read More »అడిలైడ్ టెస్ట్ ఓటమితో రోహిత్ శర్మపై కీలక నిర్ణయం.. అదేంటంటే?
అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమి తర్వాత, బ్రిస్బేన్‌లో ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటుందా? కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఓపెనింగ్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. మూడో టెస్టులో కూడా రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడగలడని వార్తలు వస్తున్నాయి. మొదటి, రెండవ టెస్ట్ మాదిరిగానే, భారత జట్టు మరోసారి జైస్వాల్‌తో కూడిన ఓపెనింగ్ జోడీని రంగంలోకి దించగా, రాహుల్, రోహిత్ శర్మ ఐదో లేదా ఆరో …
Read More »ఆయుర్వేద డిటాక్స్ టీతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఈ సమస్యలకు చెక్!
ఈ టీ ప్రయోజనాలు, దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ ఆయుర్వేద టీని CCF టీ అని కూడా అంటారు. జీలకర్ర, కొత్తిమీర, సోపుతో చేసిన ఈ టీని తాగడం వల్ల జీర్ణ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నిపుణులు ఈ టీ కొన్ని ప్రయోజనాల గురించి వెల్లడించారు..ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, చాలా మందికి వివిధ రకాల మందులు తీసుకునే అలవాటు ఉంటుంది. అవి చాలా దుష్ప్రభావాలను కలిగిస్తాయి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అనేక సాధారణ సమస్యలను …
Read More »మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియకు ఉచిత సలహా..
మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఆరోపణలు చేశారు. ఇప్పటికే మీడియాపై దాడి ఘటనపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చేయెద్దని.. క్షణికావేశంలో జరిగిన దాడి అని అన్నారు.మోహన్ బాబు హెల్త్ అప్డేట్ విడుదల చేసిన తర్వాత మంచు విష్ణు తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలోనే మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చెయ్యొద్దని క్షణికావేశంలో మాత్రమే ఆ ఘటన జరిగిందని …
Read More »మోహన్ బాబు కక్ష పెట్టుకుని కొట్టినట్లు ఉంది: టీవీ9 రజినీకాంత్
టీవీ9 జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయ్. జర్నలిస్టులతో పాటు అయ్యప్ప భక్తులు, ప్రజలు.. టీవీ9కి మద్దతుగా నిలబడుతున్నారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు జర్నలిస్టులు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు టీవీ9 ఉద్యోగులు. ఈ నిరసనలో పాల్గొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. మోహన్ బాబు ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »పాపం..తాకట్టుపెట్టిన బంగారం చీప్‌గా వస్తోందని వేలంలో కొన్నాడు.. కట్ చేస్తే..
ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. ఓ వ్యక్తి లక్షలు పెట్టి బంగారం కొన్నాడు. ఆ తర్వాత బంగారం కట్ చేస్తే వెండి బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకులను కేంద్రంగా చేసుకొని నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేసిన కేటుగాళ్ల బాగోతం ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మణుగూరులో …
Read More »5 నెలల వ్యాలిడిటీ, 320GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్!
ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది కస్టమర్లు తమ నంబర్లను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందజేయడమే దీనికి కారణం. ఈ సిరీస్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ 5 నెలల చెల్లుబాటుతో కొత్త, చాలా చౌక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయడానికి కస్టమర్ రూ.997 …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal