పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్

Gold Rate Today: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పసిడిని ఎక్కువగా ఇష్టపడేది భారతీయులేనని చెప్పక తప్పదు. వందల సంవత్సరాల నుంచి బంగారాన్ని ఆభరణాలుగా ధరించే సంస్కృతి భారత్‌లో కొనసాగుతోంది. ఎక్కువగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో పురుషులు సైతం బంగారు నగలు ధరిస్తున్నారు. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా పసిడికి డిమాండ్ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ కొనేందుకు వెనకడుగు వేశారని తెలుస్తోంది. అలాంటి వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల్లో బంగారం ధర తులంపై ఏకంగా రూ.4000 పైన పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. బడ్జెట్ రోజున తులం బంగారం దాదాపు రూ.3000 మేర పడిపోయింది.

గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. క్రితం సెషన్‌తో చూసుకుంటే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు దాదాపు 20 డాలర్ల వరకు పడిపోయింది. ప్రస్తుతం ఔన్సు ధర 2394 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 28.68 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ రూపాయి విలువ రూ. 83.800 వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. గత వారంలో రూ.4000 పైన పడిపోయిన 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఏ మార్పు లేకుండా 10 గ్రాములకు రూ. 70 వేల 860 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం తులానికి రూ. 64 వేల 950 వద్ద ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 71,010 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 65 వేల 100 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరో రూ.500 తగ్గిన వెండి..

బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి రేటు మరింత పడిపోయింది. గత వారంలో కిలో వెండి రేటు రూ.7000 మేర తగ్గగా ఇవాళ మరో రూ.500 దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 92 వేల వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే కిలో వెండి ధర ఇవాళ రూ.500 పడిపోయి రూ. 87 వేల 500 వద్ద అమ్ముడవుతోంది. పైన పేర్కొన్న రేట్లలో ఎలాంటి ట్యాక్సులు లేవు. పన్నులు కలిపితే ధరల్లో తేడా ఉంటుందని గమనించాలి.

About amaravatinews

Check Also

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *