Secunderabad Serial killer: సికింద్రాబాద్ సీరియల్‌ కిల్లర్‌.. వెలుగులోకి ఒళ్లు గగుర్పోడిచే విషయాలు

ఒంటరి మహిళలు రైల్లో ప్రయాణం చేస్తున్నారా అయితే అలెర్టగా ఉండండి. ట్రైన్‌లలో ఒంటరిగా ఉన్న మహిళలే అతడి లక్ష్యం.. గొంతు నులిమి చంపి ఒంటి మీద ఉన్న బంగారు నగలు దోచుకెళ్ళడం అతడి నైజాం.. అతడో సైకో కిల్లర్.. తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు.. జైలు నుంచి విడుదలైన 11 రోజుల్లోనే 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్దారించారు. హరియాణాకు చెందిన రాహుల్ జాట్ అలియాస్ భోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్ (29) ఆరాచకానికి కర్ణాటక …

Read More »

‘ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో నిరుద్యోగ రేటు చాలా తక్కువ’.. కేంద్ర మంత్రి వెల్లడి

దేశంలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభకు తెలియజేశారు. 2023-24లో భారతదేశంలో యువత నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా ఉందని, ఈ రేటు ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువగా ఉంది పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 25న లోక్‌సభలో మంత్రి శోభా కరంద్లాజే రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి, నిరుద్యోగ గణాంకాల వివరాలు వెల్లడిస్తూ.. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) మన దేశంలో ఉపాధి, నిరుద్యోగ యువతకు …

Read More »

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..! రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..?

రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో.. రేవంత్‌ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి రేపుతోంది.రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..! Stay Tune To CM అంటోంది.. రేవంత్‌ సర్కార్. మరి తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు చెప్పే ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటి..? రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..? ఇంతకూ ప్రభుత్వంపై రైతులకున్న అంచనాలేంటి.. …

Read More »

NEET PG 2024 Counselling: పీజీ మెడికల్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోఎండీ, ఎంఎస్‌ పీజీ మెడికల్‌ నాన్‌ సర్వీస్‌ కేటగిరీ సీట్లకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తైంది. మొత్తం 1722 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయని విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా మెడికల్‌ కాలేజీల్లో డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఫస్ట్‌ ఇయర్‌ పీజీ మెడికల్‌ తరగతులు డిసెంబరు 20వ …

Read More »

Tirupati Laddu Row: నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. ఏఆర్‌, వైష్ణవి డెయిరీలతో పాటు తిరుమలలో కూడా తనిఖీలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనపై సిట్ విచారణ షురూ చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణలో దూకుడు పెంచారు సిట్ అధికారులు. శ్రీవారి ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. లడ్డు బూందీ పోటులో సోదాలు చేశారు. లడ్డూ బూందీకి వినియోగించే నెయ్యిని పరిశీలించారు. గత జగన్ ప్రభుత్వంలో వాడిన నెయ్యిపై ఆరా తీశారు. వినియోగించే నెయ్యి నాణ్యత గురించి విచారణ బృందం అడిగి తెలుసుకుంది. రోజూ ఎంత నెయ్యి వినియోగిస్తారు? ఎక్కడ నుంచి తీసుకొస్తారంటూ? అక్కడి అధికారుల నుంచి సమచారం రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే …

Read More »

ఏపీలో నార్మలైజేషన్‌ లేకుండా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?

రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. భారీగా ఉపాధ్యాయ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఆన్ లైన్ లో ఉంటుంది కాబట్టి పలు విడతలుగా నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కొందరికి ప్రశ్నాపత్రం కఠినంగా, కొందరికి సులువుగాత వస్తుండటంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. పైగా నార్మలైజేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు.. దీనికి స్వస్తి చెప్పేందుకు..ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల మరింత ఆలస్యం అవుతుందని …

Read More »

ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ అరెస్ట్.. ఏకంగా రూ. 70 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ

మాజీ డిప్యూటీ CM , శ్రీకాకుళం జిల్లా YCP అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం నుండి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ACB అధికారులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు, జిల్లాలోని మురళీ స్వగ్రామం కోటబొమ్మాళి మండలం దంత గ్రామం, లింగనాయుడిపేట, అతను పని చేస్తున్న బుడితి CHCలోనూ సోదాలు చేపట్టారు. కృష్ణ …

Read More »

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ బస్సు సర్వీసులలో టికెట్ చార్జీలు తగ్గింపు..! 

ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవోలకు అప్పగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.చలి పంజా విసురుతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఆ ప్రభావం ఏపీఎస్ఆర్టీసీపై పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రివేళ్లలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతుండడంతో, బస్సు ప్రయాణికులపై ఆ ఎఫెక్ట్ చూపుతుంది. చలికి గజగజ వణికిపోతోన్న ప్రయాణికులు ఇప్పుడు ఏపీ బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. దీంతో పలు రూట్లలో …

Read More »

Vande Bharat: ఏపీకి మరో వందే భారత్‌.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ!

సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్‌లో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీతో కూడిన రైలు. ఈ రైలుకు ఇతర రైళ్లకంటే టికెట్‌ ధర ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.. భారత రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణించే రైల్వేలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ …

Read More »

Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?

చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి అసలు కారణం ఏంటి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చీకటిపడుతోంది. ఇదిలా ఉంటే చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారి మెరుపును కోల్పోతుంది. పెదవులు మొదలు ముఖం, కాళ్లు చేతులు పగులుతాయి. దీంతో మాయిశ్చరైజర్లు …

Read More »

అసలుది వదిలి.. మరో గ్రూపు రక్తం ఎక్కించిన వైద్యులు.. ప్రాణం తీసిన సర్కార్ ఆసుపత్రి వైద్య సిబ్బంది..!

కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దారుణం వెలుగు చూసింది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఒక రక్తానికి బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించడం వల్ల ఓ మహిళ ప్రాణాల కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అనుభవజ్ఞులైన వైద్యులున్నారు. కావాల్సినన్ని మౌలిక సదుపాయాలున్నాయి. కానీ ఇక్కడ ప్రాణం ఖరీదు కేవలం రూ.3 లక్షలు మాత్రమే. కొంతమంది వైద్య విద్యార్థుల అవగాహనా రాహిత్యంతో నిర్లక్ష్యంగా ఒక గ్రూపునకు బదులు మరో గ్రూపు రక్తం …

Read More »

నిర్మానుష్య ప్రదేశంలోకి డ్రోన్ పంపిన పోలీసులు.. చెట్ల పోదల మాటున చిక్కారుగా

బ్లేడ్‌ బ్యాచ్‌..గంజాయి గ్యాంగ్‌.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు. డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్‌ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు చెక్ పెడుతున్నారు. అనంతపురం శివారు ప్రాంతాల్లో ఆకతాయుల ఆట కట్టించేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు పోలీసులు.పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో తాగేస్తున్న మందుబాబులకు దడ …

Read More »

 తిరుమలలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం.. త్వరలో అన్నిసేవలకు ఆధారే ఆధారం..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పాపాలను పోగొట్టుకునిసద్గతి పొందాలని భక్తులు భావిస్తారు. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేస్తారు. అటువంటి పవిత్ర పుణ్య క్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అవినీతి పనులు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ముదస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న …

Read More »

 వామ్మో.. పదేళ్ల తర్వాత ఢిల్లీలో డేంజరస్ వైరస్ కేసు నిర్ధారణ.. లక్షణాలు ఏమంటే..?

ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో ఏమో.. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా జపనీస్ మెదడువాపు జ్వరం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రకారం, ఢిల్లీలోని వెస్ట్ జోన్‌లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో …

Read More »

నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మనం పుట్టక ముందు అంటే.. కోట్ల సంవత్సరాల క్రితం.. డైనోసర్ల కాలం మనుగడలో ఉండేది. ఆకారంలో భారీగా.. పెద్దవిగా ఉండే ఈ డైనోసర్ లాంటి జీవులు కొన్ని ఇప్పటికీ ప్రపంచంలోని నలుమూలల ఎక్కడొక చోట ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నాయి. ఇక వాటిలా ఉండే ఓ జీవి టైటానోబోవా పాము. దీనిని ‘మోన్‌స్టర్ స్నేక్’ అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అతి పెద్ద పాముల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో కనిపించే అనకొండల కంటే ఇవి చాలా పెద్దవి. మొసళ్లను …

Read More »