ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ బస్సు సర్వీసులలో టికెట్ చార్జీలు తగ్గింపు..! 

ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవోలకు అప్పగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

చలి పంజా విసురుతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఆ ప్రభావం ఏపీఎస్ఆర్టీసీపై పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రివేళ్లలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతుండడంతో, బస్సు ప్రయాణికులపై ఆ ఎఫెక్ట్ చూపుతుంది. చలికి గజగజ వణికిపోతోన్న ప్రయాణికులు ఇప్పుడు ఏపీ బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సు సర్వీసులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సీట్లు ఫుల్ కాకుండానే అలాగే వెళ్లాల్సివస్తోంది..!

ఆర్టీసీపై శీతాకాలం ప్రభావం చూపుతోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతూ ఉండడంతో బస్సు ప్రయాణాలపై ఆ ప్రభావం చూపుతోంది. చలికి గజగజ వణికిపోతోన్న ప్రయాణికులు ఏసీ బస్సులను ఎక్కేందుకు హడలిపోతున్నారు. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ సర్వీస్ బస్సుల్లో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సీట్లు పూర్తిగా నిండకుండానే అలాగే వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఆర్టీసీ నష్టాలను నివారించాలని, ప్రయాణికులను ఆకర్షించేందుకు నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలను 10 నుంచి 20 శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులకు లబ్ది చేకూరుతున్న దృష్ట్యా బస్సుల్లో సీట్లు నిండటం సహా ఆదరణ పెరిగేందుకు ఉపకరిస్తుందని అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో చలి విజృంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ పైనా దీని ప్రభావం పడింది. చలి విపరీతంగా పెరగడంతో పలు రూట్లలో ఆర్టీసీ ఏసీ బస్సులు ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో పలు ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏసీ బస్సుల్లో సీట్ల ఖాళీలను బట్టి 10 నుంచి 20 శాతం ఛార్జీ తగ్గించాలని ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. బస్సుల్లో నిండిన సీట్ల సంఖ్యను బట్టి ఛార్జీలను డిసెంబర్ నెలకు మాత్రమే వర్తించేలా ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఆదేశించింది.

ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవోలకు అప్పగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తూ ఎన్టీఆర్ జిల్లా డీపీటీవో ఎం. యేసుదానం ఆదేశాలు జారీ చేశారు. ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తగ్గించిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 10 శాతం తగ్గించారు. ఆదివారం నాడు హైదరాబాద్‌కు, శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూటులో చార్జీ తగ్గింపు లేదని తెలిపారు..

అదే విధంగా విజయవాడ – బెంగళూరు మధ్య తిరిగే వెన్నెల స్లీపర్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 20 శాతం తగ్గించారు. విజయవాడ – బెంగళూరు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో చార్జీ రూ. 2,170 రూపాయల నుంచి రూ. 1,770 రూపాయలకు తగ్గించారు. విజయవాడ- బెంగళూరు మధ్య అమరావతి ఏసీ బస్సుల్లో చార్జీ రూ. 1,870 రూపాయలు ఉండగా దాన్ని రూ. 1,530 రూపాయలకు తగ్గించారు. ఈ రూట్లో ఆదివారం బెంగళూరు కు, శుక్రవారం విజయవాడ కు వెళ్లే ప్రయాణికులకు చార్జీ తగ్గింపు లేదని అధికారులు తెలిపారు. విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో చార్జీ 10శాతం తగ్గించారు.

విజయవాడ – విశాఖ – అమరావతి బస్సుల్లో చార్జీ రూ.1,070 రూపాయల నుంచి రూ. 970 రూపాయలకు తగ్గించారు. రాను పోను టికెట్లు ఒకేసారి రిజర్వు చేసుకున్న వారికి ఛార్జీలో 10 శాతం రాయితీ వర్తింపజేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు సదావకాశాన్ని వినియోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఛార్జీలు తగ్గింపు వర్తింపజేయాలని ఆదేశించారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటే చార్జీపై తగ్గింపు ఇచ్చే గడువును మరికొన్ని రోజులు పెంచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ అనంతరం బస్సుల్లో రద్దీ పెరిగితే ఛార్జీల తగ్గింపును తీసివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

About Kadam

Check Also

 అద్దె ఇంటి కోసం వచ్చి.. ఎంత పని చేశారు.. వామ్మో మీరు జాగ్రత్త!

ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు నటించిన దొంగలు, బంగారం, నగదు కోసం ఇంటి యాజమానులైన వృద్ధ దంపతులను హతమార్చారు.ఖమ్మం జిల్లా వృద్ధ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *