Blog Layout

వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. ఇవగో పూర్తి డీటేల్స్..

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదనీటితో కొన్ని రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని మార్గమార్చారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కరీంనగర్‌–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్‌, కాచిగూడ–మెదక్‌, మెదక్‌–కాచిగూడ, బోధన్‌–కాచిగూడ, ఆదిలాబాద్‌–తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నిజామాబాద్‌–కాచిగూడ రైలు రద్దు కానుంది. మహబూబ్‌నగర్‌–కాచిగూడ, షాద్‌నగర్‌–కాచిగూడ రైళ్లను కొంత దూరం వరకే నడిపి పాక్షికంగా రద్దు చేశారు. కామారెడ్డి–బికనూర్‌–తలమడ్ల, అకన్పేట్‌–మెదక్‌ మధ్య రైల్వే …

Read More »

చోరీ కేసును విచారిస్తుండగా ఊహించని ట్విస్ట్.. ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమే..

తునిలో వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఈ చోరీ వెనక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. అమ్మాయిగా మారాలని ఆకాంక్షించిన సతీష్‌ (అవంతిక రెడ్డి) తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్‌ సర్జరీ కోసం డబ్బు సమకూర్చుకోవడానికే ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు వెనుక ఒక ఊహించని స్టోరీ బయటపడింది. ట్రాన్స్‌జెండర్‌గా మారాలన్న ఆరాటమే ఈ క్రైమ్‌కు కారణమని పోలీసులు తేల్చారు. ఆగస్టు 20న తుని …

Read More »

వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్‌ సాయం..! ఏ విధంగా అందిస్తున్నాయంటే..?

భారీ వర్షాలు, వరదలు అనేక కుటుంబాలను ప్రభావితం చేశాయి. వరద ప్రాంతంలో చిక్కుకున్న వారు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ టెలికామ్‌ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దేశంలోని వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలోని అన్ని ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో 3 రోజుల చెల్లుబాటు పొడిగింపును ప్రకటించింది. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మూడు రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను పొందుతారు. జియోహోమ్ వినియోగదారులకు, అంతరాయం …

Read More »

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం. 2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్‌ డాలర్ల GDPతో ‍ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని, 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా 20.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని …

Read More »

వరుణుడి ఉగ్రరూపం.. తండ్రీకొడుకులతో సహా వరదలో కొట్టుకుపోయిన కారు!

కామారెడ్డి జిల్లాపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. బుధవారం ఒక్కరోజే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. ఇక నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో జిల్లాలోని దోమకొండ మండలం సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సమీపంలో వరదలో చిక్కుకొని ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న తండ్రీకొడుకులు వాగులోని వరద నీటిలో కొట్టుకుపోయారు. దోమకొండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మేక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు …

Read More »

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో పలు పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు …

Read More »

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం మామూలుగా లేదు.. గ్యాప్‌ లేకుండా దంచికొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడమే కాదు.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే ట్రాక్‌లు తెగిపోవడం.. వరదలకు కార్లు కొట్టుకుపోవడం.. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరుణ బీభత్సం కంటిన్యూ అవుతోంది. అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. ఇటు గుంటూరు, పల్నాడు, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాన వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో …

Read More »

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్ వినాయక మండపం కూడా ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలోని పొనుగుటివలస గ్రామం వినాయకచవితి ఉత్సవాలకు ప్రసిద్ధి. ఈ గ్రామస్తులు నిర్వహించే వినాయకచవితి ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ …

Read More »

దశాబ్దాలుగా వినాయచవితి పండగకు ఆ ఊరు దూరం.. కారణం ఏంటో తెలుసా?

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందుకు ఒక గణనాథుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్వీకుల నుంచి ఆ గ్రామంలో అసలు వినాయకుడి పండుగ జరుపుకోలేదట. ఈ గ్రామంలో ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం విశేషం. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదు. తాత, ముత్తాతల నుంచి బసంపల్లిలో వినాయక …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్‌.. దక్షిణ రైల్వేలో 3518 ఉద్యోగాలు! రాత పరీక్షలేకుండానే ఎంపిక

దక్షిణ రైల్వే.. చెన్నైలోని రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3518 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, వైర్‌మెన్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 26, 2025వ తేదీ …

Read More »