ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కల సాకారం కావడంలో …
Read More »