Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఈ రూట్లలోనే..!

Vande Bharat Express: 2019లో రైల్వేశాఖ ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లు.. సాధారణ రైళ్లతో పోల్చితే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా రైలు ప్రయాణికులకు మాత్రం వేగం, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇక ఈ సెమీ హెస్పీడ్‌ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. రైలు ప్రయాణికుల నుంచి ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని యోచించిన రైల్వే శాఖ వచ్చే ఏడాది వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ప్రజాదరణ పొందిన వందే భారత్ రైళ్లతో పోల్చితే ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు మరిన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయని ఇప్పటికే రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇక 2025-26 మధ్య నాటికి మన దేశంలో ఒకేసారి 10 వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక డిజైన్‌తో రూపొందిన ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి. మన దేశంలోనే తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు ట్రయల్‌ రన్‌‌ను నవంబర్ 15వ తేదీ నుంచి 2 నెలల పాటు నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

2 నెలల పాటు విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత 2025లో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్‌ కోచ్ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ సుబ్బారావు ఈ విషయాన్ని వెల్లడించారు. 2 నెలల పాటు రైళ్ల ఆసిలేషన్‌ ట్రయల్స్‌తో పాటు ఇతర టెస్ట్‌లు చేస్తామని.. ఆ తర్వాత కమర్షియల్‌ సర్వీస్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

About amaravatinews

Check Also

Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం

ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్‌గిర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *