ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగిరెడ్డి చెరువు గట్టున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. షష్టి ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవరోజు స్వామివారికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు.
భగవంతునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం భగవంతునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంలా మనతోపాటు మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ పంచుతారు. భగవంతుని ప్రసాదం కాస్త దొరికిన చాలు అని దాని నోటిలో వేసుకుని తృప్తి పొందేవారు ఎందరో ఉన్నారు.. సాధారణంగా ఆలయాలలో దేవుడికి నైవేద్యంగా చెక్కరి పొంగలి, పులిహార, దద్దోజనం, కదంబం, అరటి పళ్ళు లాంటివి సమర్పిస్తారు. కానీ ఇటీవల కాలంలో ఆలయాలలో ఉత్సవమూర్తులకు భారీగా నైవేద్యాలు పెడుతున్నారు. రకరకాల వెరైటీ పిండి వంటలు వండి నైవేద్యాలు పెట్టడంలో పోటీలు పడుతున్నారు. ఈ క్రమంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 రకాల వెరైటీలతో మహా నైవేద్యాన్ని భక్తులు సమర్పించారు.
ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగిరెడ్డి చెరువు గట్టున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. షష్టి ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవరోజు స్వామివారికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు. ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అరిసెలు, గారెలు, బూరెలు, మైసూర్ పాకులు, లడ్డూలు, జాంగ్రీలు, పూతరేకులు, కాజాలు, పాలకోవా, జిలేబి, లాంటి రకరకాల పిండి వంటలతో రకరకాల వెరైటీలకు చెందిన స్వీట్లను తయారు చేయించారు. అదేవిధంగా వివిధ రకాల పండ్లను సిద్ధం చేశారు. ముందుగా మహిళలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ నైవేద్యాన్ని పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ మహా నైవేద్యాన్ని స్వామివారి ముందు ఉంచారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్కు హారతులు పట్టి నైవేద్యాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆ మహా నైవేద్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వామి వారికి సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు పొందారు.