Ayushman Vay Vandana: ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. సీనియర్ సిటిజన్లు వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజీని పొందునున్నట్లు ఆయన తెలిపారు.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల కుటుంబాల్లోని 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతారని అన్నారు.
“నవంబర్ 25 వరకు, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం సుమారు 14 లక్షల ఆయుష్మాన్ వయ వందన కార్డులు రూపొందించాం” అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ పథకం కోసం అంచనా వ్యయం రూ.3,437 కోట్లు. ఈ వ్యయంలో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.2,165 కోట్లను కేంద్ర వాటాగా ఖర్చు చేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ పథకం కింద మొత్తం 29,870 ఆసుపత్రులు జాబితా చేయగా, వాటిలో 13,173 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ పథకం కింద జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో సహా 27 మెడికల్ స్పెషాలిటీలలో 1,961 విధానాలను కవర్ చేసే నగదు రహిత ఆరోగ్య సేవలు అందించనున్నారు.
ఎముకలు, గుండె, క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలతో అన్ని వయసుల వారు కూడా దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు.
మంత్రిత్వ శాఖ ప్రకారం, హీమోడయాలసిస్/పెరిటోనియల్ డయాలసిస్, అక్యూట్ ఇస్కీమిక్ స్ట్రోక్, హైపర్‌టెన్షన్, టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్, మోకాలి మార్పిడి, పీటీసీఏ, డయాగ్నోస్టిక్ యాంజియోగ్రామ్, సింగిల్ ఛాంబర్ పర్మనెంట్ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్, డబుల్ ఛాంబర్ పర్మనెంట్ పేస్‌లిగేషన్ వంటి సేవలు సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్నాయి.