హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురికావడంతో అధికారులు యాక్షన్‌లోకి దిగారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు కల్లు కాంపౌండ్లు సీజ్‌ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు పరారీలో ఉన్నారు. కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు కంపౌండ్‌లలో కల్లు తాగిన బాధితులు వాంతులు, లో బీపీతో ఆస్పత్రిలో చేరారు.

నిమ్స్‌లో ప్రస్తుతం 12 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. గాంధీలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. రాందేవ్ హాస్పిటల్‌లో మరికొరికి ట్రీట్‌మెంట్ అందుతోంది. 15 మందిలో గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి చెందారు. కల్లు శాంపిల్స్ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. కల్లు సేవించిన మూడు కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. ఎన్ని సార్లు ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేసినా నిర్లక్ష్యం వహించారని.. సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేయాలంటున్నారు స్థానికులు.

కాగా, నిమ్స్ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించి.. అందరినీ హాస్పిటల్స్‌కు తరలించామన్నారు మంత్రి.

About Kadam

Check Also

అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *