16 ఏళ్లకే ఏడు ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన హైదరాబాది!.. రికార్డులు చూస్తే..

సాధారణంగా ఒక్కొక్కరికి ఏదో ఓ అలవాటు ఉంటుంది. వాళ్లు ఆ పనిని చేసేందుకే చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఈ హైదరాబాదీ యువకుడు కూడా అంతే. ఈ యువకుడికి పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. దీంతో అదే పనిని హాబీగా మార్చుకున్నాడు. 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను ఎక్కి సత్తాచాటాడు. 2020లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ కుర్రాడు నాలుగేళ్లలోనే అనేక బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు, ప్రశంసలను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరీ హైదరాబాదీ యువకుడు.. అతను సాధించిన విజయాలు, అధిరోహించిన పర్వతాల గురించి తెలుసుకుందాం పదండి.

చిన్నప్పట్నుంచి కష్టం అంటే ఏంటో తెలీకుండా అల్లారుముద్దుగా పెరిగాడు. అక్క ద్వారా స్ఫూర్తి పొంది పర్వతారోహణను హబీగా మార్చుకున్నాడు. అప్పట్నుంచి కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఆపై శిఖరాలను ఎక్కేందుకు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అది ప్రాణాలతో చెలగాటమే. వాటన్నిటినీ సమయస్పూర్తితో, సంయమనంతో అధిగమిస్తూ 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను విజయవంతంగా అధిరోహించాడు. దీంతో ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇంత చిన్నవయసులోనే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డిప్రెషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెంటల్ స్ట్రెంత్ గురించి చెప్పే మోటివేషనల్ స్పీకర్‌గానూ ఎదిగాడు.

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఫిరోజ్‌గూడకు చెందిన పడకంటి రాజేందర్‌ ప్రసాద్-లక్ష్మీ దంపతుల కుమారుడే ఇక్కడ కనిపిస్తున్న విశ్వనాథ్‌ కార్తికేయ. ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుల్లో చురుగ్గా ఉండే కార్తికేయ.. 2020లో పర్వతారోహకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. నార్త్‌ అమెరికాలోని డెనాలి, యూరప్‌లోని ఎల్‌బ్రూస్, ఆఫ్రికాలోని కోసీజ్‌కో, ఇండియాలోని కాంగ్‌ఎట్‌సీ 1, 2, ఫ్రెండ్‌షిప్ పీక్, నేపాల్‌లోని ఐస్‌ల్యాండ్‌పీక్, సౌత్‌ఆఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో, అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్‌ సహా మొత్తం 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను అధిరోహించాడు.

తాజాగా జనవరి 22న దక్షిణ అమెరికాలోని 6,961 మీటర్ల ఎత్తైన అకోంకగ్వా శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు. విశ్వనాథ్‌ కార్తికేయ ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవడంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. పర్వతారోహకులు కలగా భావించే మౌంటే ఎవరెస్టు శిఖరాన్ని సైతం ఈ యువకుడు అధిరోహించాడు. దీంతో 7 ఖండాల్లో 7 ఏత్తైన పర్వతాలు అధిరోహించిన పిన్న వయస్కుడిగా కార్తికేయ చరిత్ర సృష్టించాడు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *