వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త.. సంక్రాంతి ముందే వచ్చేసిందిగా

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త. సంక్రాంతి ముందే వచ్చేసిందని చెప్పొచ్చు. జనవరి 11 నుంచి విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. 20833-34 నెంబర్ గల విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం 16 కోచ్‌లతో 1,128 ప్యాసింజర్ల సామర్థ్యంతో సేవలు అందిస్తుండగా.. రేపటి నుంచి అనగా జనవరి 11న ఈ ట్రైన్ 1,414 ప్యాసింజర్ల సామర్థ్యంతో 20 కోచ్‌లతో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం 16 కోచ్‌లు ఉన్న ఈ వందేభారత్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి.

ఈ తరుణంలోనే రైలు స్థిరంగా 130 శాతం కంటే ఎక్కువ డిమాండ్‌తో నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణీకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో మరో 4 అదనపు కోచ్‌లతో పెంచాలని నిర్ణయించింది. తదనుగుణంగా, ఈ రైలును 2025 జనవరి 11 నుంచి ప్రస్తుత 16 కోచ్‌ల సామర్థ్యానికి బదులుగా 20 కోచ్‌ల సామర్థ్యంతో నడపాలని దక్షిణ మధ్య రైల్వే డిసైడ్ అయింది. నూతన సవరించిన కూర్పులో 1,336 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 18 చైర్ కార్లు ఉండనుండగా.. 104 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు కలిపి మొత్తం 20 కోచ్‌లలో 1,440 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. కాగా, ప్రయాణీకులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు.

About Kadam

Check Also

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెలలో 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే..

తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉంటుంది. పండగలు, విశేషమైన రోజుల్లో మాత్రమే కాదు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *