వీరరాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..

దేవుడి పేరు చెప్పి దందాలు చేసే బ్యాచ్‌లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయ్.. ఇలాంటి వాళ్లలో వీరరాఘవరెడ్డి తీరు వేరే లెవెల్‌..! ఇతని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మ్యూజిక్‌ టీచర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన వీరరాఘవ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం తన ప్లాన్ అమలు చేసేందుకు ప్రైవేట్‌ ఆర్మీని రెడీ చేసుకున్నాడు.. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి మొదటి స్లాట్‌లో 5 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. 20 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లను రిక్రూట్‌ చేసుకుంటున్నాడు. కనీసం 5 కిలోమీటర్లు నడిచే శక్తి ఉండి తాను చెప్పించి చెప్పినట్టు చెస్తే చాలు.. అలాంటి వాళ్లకు జీతాలిచ్చి తన వెంట తిప్పుకుంటున్నాడు.

రామరాజ్యంలో చేరిన వారికి ప్రతి నెల 20 వేల జీతంతో పాటు వసతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాడు ఈ వీర రాఘవరెడ్డి. 350 రూపాయల రుసుముతో గత ఏడాది సెప్టెంబర్ 1నుంచి డిసెంబర్ 31వరకు కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా చేశారు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు రామరాజ్యం ఆర్మీకి 1 లక్ష 20వేల 599 రూపాయలు విరాళంగా వచ్చాయి. ఐతే.. అంతకు కొన్ని రెట్లు మొత్తం దందాలతో లాక్కున్నట్టుగా అనుమానిస్తున్నారు. అందుకు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. CRPC సెక్షన్ ‌340ని న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని.. దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసిన వీర రాఘవరెడ్డి వాదనగా ఉంది. తానేదో హిందూధర్మం ఉద్ధరణకు పనిచేస్తున్నట్టు బిల్డప్‌ ఇస్తూ.. కొన్ని ఆలయాలకు వెళ్లి అక్కడి అర్చకుల్ని బెదిరించడం వాళ్ల నుంచి డబ్బులు లాక్కునే ప్లాన్‌లు వేయడం రాఘవరెడ్డికి పరిపాటిగా మారింది.- చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడితో ఒక్కసారిగా వీర రాఘవరెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో దాడి చేసిన బ్యాచ్‌ను గుర్తించి ఒక్కొకరినీ అరెస్టు చేస్తున్నారు.

చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు. వీర రాఘవరెడ్డిని 5 రోజులు కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో మొయినాబాద్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దాడి చేసిన మొత్తం 25 మందిని గుర్తించారు.. వాళ్ల కోసం ఏపీలో తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. రంగరాజన్‌పై దాడి కేసులో A1 వీర రాఘవరెడ్డి ఉన్నాడు.. ఇతను మ్యూజిక్‌ టీచర్‌..  A2 సాయన్న.. ఇతను ఓ మెడికల్ షాప్‌ ఓనర్‌. A3గా ఉన్న భూక్య గోపాలరావు డైలీ లేబర్‌గా చెప్తున్నారు.. ఈ కేసులో A4గా భూక్య శ్రీను ఉన్నాడు. అతను టైలర్‌..  మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

About Kadam

Check Also

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *