విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. అందులోని 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయి ఉందని అనుమానంతో ఒరిస్సా నుంచి ట్రాక్ చేసి లారీని కొట్టెక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నామన్నారు. లారీ, రెండు బొలెరో వాహనాలు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Amaravati News Navyandhra First Digital News Portal