సారు మా బడికి రండి! – సీఎం, డిప్యూటీ సీఎంకు స్టూడెంట్స్‌ లేఖలు.. ఎందుకో తెలిస్తే..

ప్రైవేట్‌ స్కూల్స్‌ తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమను ప్రభుత్వ స్కూల్‌లలో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థులు. సార్‌ ఒకసారి మా బడికి రండీ అంటూ ఆ ఉత్తరాల్లో పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం వెదుళ్ళపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వ స్కూల్‌లో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులను ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు. మేమంతా రుణపడి ఉంటామంటూ ఆ ఉత్తరాల్లో పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల నుంచి నుండి పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి స్వయంగా విద్యార్థులే ఉత్తరాలను పోస్ట్ బాక్స్‌లో వేశారు. పాఠశాలలో తమకు అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన గురించి ఉత్తరాల్లో తల్లిదండ్రులకు వివరించారు. అలాగే ఈ నెల 10వ తేదీన జరగబోయే మెగా పేరెంట్స్ మీట్‌కు రావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రికి ఆహ్వానం పంపారు.

అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, సన్నబియ్యంతో భోజనం, విద్యామిత్ర కిట్లు వంటి పథకాలు అందుబాటులోకి తీసుకురావడం తమకు ఎంతో అండగా నిలుస్తోందని సీఎం చంద్రబాబుకు 20 మంది విద్యార్థులు ఉత్తరాలు రాశారు, డిప్యూటీ సీఎంకు 13 మంది, విద్యాశాఖ మంత్రికి 10 మంది విద్యార్థులు ఉత్తరాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇక విద్యాశాఖ అధికారులకు, డీఈవో, ఏపీసీ, ఎంఈవోలకు 10 మంది విద్యార్థులు ఉత్తరాలు రాశారు. స్కూల్స్‌లో అన్ని వసతులు కల్పించినందుకుగాను స్థానిక ఎమ్మెల్యేకు సైతం ఏడుగురు విద్యార్థులు ఉత్తరాలు రాశారు.

తాము చదువుకునేందుకు పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్న ప్రభుత్వానికి, అధికారులుకు ఉత్తరాలతో కృతజ్ఞతలు తెలపాలనే విద్యార్థుల వినూత్న అలోచనకు స్థానికులు ఫిదా అవుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, విద్యా శాఖ మంత్రి లోకేష్‌కు మండలంలోని తల్లిదండ్రులకు కృతజ్ఞతలుగా ఉత్తరాలతో పంపిన విద్యార్థులు పోస్ట్‌లు ఇప్పుడు వైరల్‌గా మారడంతో పాటు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.


About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *