తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రా అబ్బాయి సత్తా.. రిజల్ట్స్‌ను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి..

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఐసెట్ లో అమ్మాయిలు 30,986, అబ్బాయిలు 27998 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా.. పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు సాధిస్తే వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఐసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ ను, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్‌ చేసి తాము సాధించిన మార్కులు, ర్యాంక్‌లను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ఐసెట్ ఫలితాల్లో అబ్బాయిలదే హవా..

తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో టాప్ 4 అబ్బాయిలే నిలిచారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన క్రాంతి కుమార్ తెలంగాణ ఐసెట్ టాపర్‌గా నిలిచారు. 179.93 మార్కులతో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.. కామారెడ్డికి చెందిన సాయికృష్ణకు 155.17 మార్కులతో సెకెండ్ ప్లేస్ దక్కింది. మహబూబాబాద్ కు చెందిన కౌశిక్ 3వ ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన కృష్ణ వర్ధన్ కు నాలుగవ ర్యాంక్, జగిత్యాలకు చెందిన వైష్ణవికి టాప్ 5 ర్యాంక్ కైవసం చేసుకుంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *