ఇంద్రకీలాద్రి పై అట్టహాసంగా శాకంభరి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి… మూడు రోజులపాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళతో అలంకరించనున్నారు..
అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ మొదటి రోజు కావడంతో కేవలం దాతలు ఇచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు పళ్ళతోనే అలంకారం చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి అలంకరణకు దాదాపు 10 టన్నుల కూరగాయలు ఆకుకూరలని వినియోగించారు.. ఈ ఉత్సవాలు జులై 10 తో ముగియనున్నాయి. హరిత వర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి పై నేడు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఇంద్రకీలాద్రి ఈవో.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక పండగకు భక్తులు వస్తారు… మొదటి రోజు కావటంతో ఈరోజు ఆలయ అలంకరణ, కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50టన్నుల కూరగాయలను ఉపయోగించారు.
గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుంచి ఈ కూరగాయలను సేకరించారు. దాదాపు గత 10 రోజులు నుంచి ఈ కూరగాయల సేకరణ చేశారు ఆలయ సిబ్బంది. ఇక ప్రధాన ఆలయం లో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహా మండపం లో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు. ఒక పక్క ఆషాడం కావటం తో దుర్గమ్మకు సార సమర్పించే బృందాలతో పాటు భక్తజనసంద్రంతో ఇంద్రకీలాద్రి నిండిపోయింది. ఇక నేటి నుంచి శాఖంబరు ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆ రద్దీ మరింత పెరిగిన నేపథ్యంలో ఆలయ అధికారులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీ నీ నియంత్రించటానికి దేవాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి దేవాలయసిబ్బందికి సెలవుల రద్దు చేశారు. ఆషాఢ సారె సమర్పణ బృందాలు, శాకంబరీ దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.