న్యూఢిల్లీలోని ఢిల్లీ సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB).. 2025-26 ఏడాదికి సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ శాఖలలో, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలలో మొత్తం 2119 టీచింగ్, మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
- మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 37
- ఆయుర్వేద ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య: 8
- పీజీటీ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ (పురుషులు) పోస్టుల సంఖ్య: 4
- పీజీటీ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ (మహిళలు) పోస్టుల సంఖ్య: 3
- పీజీటీ ఇంగ్లిష్ (పురుషులు) పోస్టుల సంఖ్య: 64
- పీజీటీ ఇంగ్లిష్ (మహిళలు) పోస్టుల సంఖ్య: 29
- పీజీటీ సంస్కృతం (పురుషులు) పోస్టుల సంఖ్య: 6
- పీజీటీ సంస్కృతం- (మహిళలు) పోస్టుల సంఖ్య: 19
- పీజీటీ హార్టికల్చర్ (పురుషులు) పోస్టుల సంఖ్య: 1
- పీజీటీ అగ్రికల్చర్ (పురుషులు) పోస్టుల సంఖ్య: 5
- డొమెస్టిక్ సైన్స్ టీచర్ పోస్టుల సంఖ్య: 26
- అసిస్టెంట్ (ఆపరేషన్ థియేటర్ సంబంధిత విభాగాలు) పోస్టుల సంఖ్య: 120
- టెక్నీషియన్ (ఆపరేషన్ థియేటర్ సంబంధిత విభాగాలు) పోస్టుల సంఖ్య: 70
- ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) పోస్టుల సంఖ్య: 19
- వార్డెన్ (పురుషులు మాత్రమే) పోస్టుల సంఖ్య: 1676
- ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 30
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) పోస్టుల సంఖ్య: 1
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మైక్రోబయాలజీ) పోస్టుల సంఖ్య: 1
పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఈడీ, బీఏఈడీ, బీఎస్సీఈడీ, ఎంఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి.. పోస్టులను అనుసరించి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ విభాగాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల మైనస్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైతే లెవెల్ 2 పోస్టులకు రూ19,900 నుంచి రూ.63,200 వరకు, లెవెల్ 8 పోస్టులకు రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు ప్రతినెలా జీతంగా చెల్లిస్తారు.