నియోజవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని అన్నారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారని.. ప్రస్తుతం తన అల్లుడి కారును వాడుతున్నానన్నారు.
‘‘గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా’’.. అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. జనసేన పార్టీ నియోజవర్గ సమావేశంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని అన్నారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారని.. ప్రస్తుతం తన అల్లుడి కారును వాడుతున్నానని.. అలాంటిది కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసని.. మనందరికీ మంచి రోజులు వస్తాయని బత్తుల బలరామకృష్ణ చెప్పుకొచ్చారు. అయినా నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. కమిట్మెంట్ ముఖ్యమని బత్తుల బలరామకృష్ణ చెప్పారు. తన ఆస్తిని అమ్మానని.. అవసరమైతే పిల్లల ఆస్తి కూడా అమ్మి కార్యకర్తలను గెలిపిస్తానని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.