చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా.. కాకతీయ, బౌద్ధమత ఆనవాళ్లు చారిత్రక శిల్పకళా సంపదకు నిలయంగా నల్లగొండ జిల్లా ఉంది. ఈ ప్రాంతంలో బౌద్ధమత ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బ్రహ్మలిపికి సంబంధించిన శాసనం వెలుగు చూసింది. బ్రహ్మ లిపి శాసనం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉపయోగించబడిన ఒక రకమైన లిపిలో చెక్కబడిన శాసనాలు.. ఈ లిపిని బ్రాహ్మ లిపి అని కూడా అంటారు. ఇది చాలా పురాతనమైన లిపి.. దేశంలోని అనేక ప్రాంతాలలో శాసనాలు, నాణేలు, ఇతర వ్రాతపూర్వక అవశేషాలలో చరిత్రకారులు బ్రహ్మలిపిని కనిపెట్టారు. బ్రహ్మలిపి శాసనాలు, అశోకుడు, శాతవాహన కాలం నాటి శాసనాలలో కూడా ఉపయోగించబడ్డాయి. ఈ శాసనాలలో ప్రాకృతం, సంస్కృతం తెలుగు. ఉపయోగించి శాసనాలు చెక్కారు. ఇలాంటి పురాతనమైన బ్రహ్మలిపికి చెందిన ఓ శాసనం తాజాగా బయటపడింది.
బౌద్ధ కాలం ఆనవాళ్లు.. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు
యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం.. చాడ గ్రామంలో బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. పురావస్తుశాఖ అధికారులు అనేక తవ్వకాలు జరిపి బౌద్ధమత అవశేషాలను వెలుగులోకి తెచ్చారు. 2012లో చాడ గ్రామాన్ని బౌద్ధ పరిరక్షణ కేంద్రంగా పురావస్తు శాఖ గుర్తించింది. అప్పటినుంచి ఆ గ్రామంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం చాడలో జరిపిన తవ్వకాల్లో వస్తువులలో బ్రాహ్మ లిపి శాసనం బయట పడింది.
రాయిపై చెక్కిన శాసనం 2వ శతాబ్దానికి చెందిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ శాసనం ప్రాకృత భాషలో, బ్రహ్మ లిపిలో ఉందని తెలిపారు. చాడ గ్రామంలో వెలుగు చూస్తున్న బ్రాహ్ లిపి శాసనాన్ని హైదరాబాద్ కు తరలించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి శాసనాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు.