టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో జరగబోతోంది. ఈ వేడుక ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కుమార్తె పెళ్లి పత్రిక అందజేశారు.
తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంట పెళ్లి సందడి సన్నాహాలు మొదలయ్యాయి. ఆయన కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. అన్ని వర్గాల నుంచి తరలివచ్చే అతిథులతో ఈ వేడుక ఓ గ్రాండ్ సెలబ్రేషన్ కానుంది.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు. గాంధీ కుటుంబానికి దగ్గరిగా మెలిగే నేతగా జగ్గారెడ్డికి పేరున్న నేపథ్యంలో.. రాహుల్‌గాంధీ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
జగ్గారెడ్డి సతీమణి నిర్మల ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGIIC) చైర్‌పర్సన్‌గా ఉన్నారు. జగ్గారెడ్డి ఇంట వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. వివాహం సంగారెడ్డి రామ్‌నగర్ ప్రాంతంలోని రామ్ మందిర్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు.