ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది .
గోవా గవర్నర్‌గా ఏపీకి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. అలానే హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. ఈ మేరకు తాజాగా గవర్నర్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఇది అరుదైన గౌరవం. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. మోదీ ప్రభుత్వంలో పౌర విమానయానశాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. టీడీపీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
అశోక్ గజపతిరాజు గురించి సమాచారం….
=గజపతుల రాజ కుటుంబం నుంచి 11వ సంరక్షకుడు
=తొలిసారి 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరంలో గెలుపు
=2004 మినహా 1983-2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుస విజయాలు
=ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం
=2014లో విజయనగరం ఎంపీగా విజయం
=మోదీ కేబినెట్లో విమానయానశాఖ మంత్రి
=ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ, 2018లో కేంద్ర పదవికి రాజీనామా
=ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో 25ఏళ్ల పాటు మంత్రి
=తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు
=మహారాజా అలక్ నారాయణ విద్యాసంస్థల నిర్వహణ
=మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు
=గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
=విదేశాల్లో ఉన్నత విద్య, వివాదరహితుడైన రాజకీయవేత్త
Amaravati News Navyandhra First Digital News Portal