ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుండి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అభినందించారు. ఐఎస్ఎస్ సందర్శించిన తొలి భారతీయ వ్యోమ గామిగా శుక్లా చరిత్ర సృష్టించారు. శుక్లా అంకితభావం, ధైర్యం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి.
అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా శుభాన్షు శుక్లా కొత్త చరిత్ర సృష్టించాడు. తన అంకితభావం, ధైర్యం మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ల కలలను నిజం చేశారు. ఇది భారత మానవ అంతరిక్ష విమాన మిషన్ – గగన్యాన్ వైపు మరో మైలురాయిని సూచిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాన్షు శుక్లాను అభినందిస్తూ.. “చారిత్రాత్మక మిషన్ నుండి భూమికి తిరిగి వస్తున్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను యావత్ దేశంతో పాటు నేను స్వాగతిస్తున్నాను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా, ఆయన తన అంకితభావం, ధైర్యం మరియు మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ల కలలను ప్రేరేపించారు. ఇది మన స్వంత మానవ అంతరిక్ష విమాన మిషన్ – గగన్యాన్ వైపు మరో మైలురాయిని సూచిస్తుంది” అని అన్నారు.