రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గాల్లో 54 ప్రత్యేక రైళ్ల సేవలు పొడగింపు!

రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశంలోని పలు మార్గాల్లో సేవలందిస్తున్నా సుమారు 54 ప్రత్యేక రైళ్ల సేవలను అక్టోబర్‌ 15వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్నప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న సుమారు 54 ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్ట్ నుంచి అక్టోబర్‌ నెలల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నారు. దేశంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రయాణికులు మెరుగైన, సౌకర్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ఇక రైళ్ల వివారల విషయానికి వస్తే ఈ 54 ప్రత్యేక రైళ్లు సుమారు ఆరు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. 07191, 07192 నెంబర్‌ గల ఈ ట్రైన్‌లు కాచిగూడ-మదురై మధ్య రాకపోకలు సాగించనున్నాయి. కాచిగూడ-మదురై ట్రైన్‌ 18-08-2025 నుంచి 13-10-2025 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ మొత్తం రోజుల్లో 9 సర్వీస్‌లను అందించనుంది. ఇక మదురై-కాచిగూడ స్పెషల్‌ ట్రైన్‌ ఆగస్ట్ 20వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

రైల్వే శాఖ ఉత్తర్వులను చూడండి..

Ser

ఇక 07193,07194 నెంబర్‌ గల రెండ్రు స్పెషల్‌ ట్రైన్‌లు హైదరాబాద్‌- కొల్లం మద్య రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కొల్లం వెళ్లే ఈ స్పెషల్‌ ట్రైన్‌ ఆగస్ట్ 16 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు ప్రతి శనివారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఇక కొల్లం నుంచి హైదరాబాద్‌ మధ్య నడిచే 07194 నెంబర్ గల స్పెషల్ ట్రైన్‌ ఆగస్ట్ 18 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఇక 07230, 07229 నెంబర్‌ల రెండు రైళ్లు హైదరాబాద్‌-కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగించనున్నారు. 07229 నెంబర్‌ గల హైదరాబాద్‌-కన్యాకుమారి స్పెషల్‌ ప్రైట్ ఆగస్ట్ 13 నుంచి అక్టోబర్ 08వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉందింది. కన్యాకుమారి నుంచి హైదరాబాద్‌ మధ్య నడిచే 07229 నెంబర్ గల ఈ స్పెషల్‌ ట్రైన్ ఆగస్ట్ 15 నుంచి అక్టోబర్ 10 వరదకు ప్రతి శనివారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

గమనిక:  ఈ ప్రత్యేక రైళ్ల సేవల గురించి ఏమైనా సందేహాలు ఉంటే.. పూర్తి వివరాల కోసం దక్షణ మధ్య రైల్వే అధికారులను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *