విజయవాడలో నిన్న డబల్ మర్డర్లు చేసిన అనంతరం పరారైన రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. క్యాటరింగ్ కు వెళ్లిన సమయంలో వచ్చిన డబ్బు పంపకాల్లో వచ్చిన వివాదంలో వెంకట్రావు, రాజుపై కిశోర్ కత్తితో దాడి చేశాడు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకట్రావు బంధువులకు కబురు చేయగా.. మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్న విజయవాడలో రాజు కుటుంబ సభ్యులు ఎవ్వరో తెలియక పోలీసులు తర్జన బర్జన పడుతున్నారు..
విజయవాడ పట్టణంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడి ఈ దారుణానికి ఒడిగట్టాడో రౌడీషీటర్. ఇద్దరిని కత్తితో పొడిచి అక్కడికక్కడే చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో రౌడీషీటర్ జమ్ము కిశోర్, ఎం.రాజు (37), గాదె వెంకట్ (25).. అనే ముగ్గురు వ్యక్తులు గత మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. వీరిలో కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు. గాదె వెంకట్ విజయనగరానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురూ బుధవారం (జులై 16) మధ్యాహ్నం తమ గదిలో ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం డబ్బుల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది.
మాటామాట పెరిగడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వెంటనే కిషోర్ కత్తి తీసుకుని రాజు, వెంకట్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు. ఈ డబల్ మర్డర్ కేసులో రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కిషోర్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. క్యాటరింగ్ కు వెళ్లిన సమయంలో వచ్చిన డబ్బు పంపకాల్లో వచ్చిన వివాదంలో వెంకట్రావు, రాజుపై కిశోర్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. కిషోర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో రాజు, వెంకట్ మృతదేహాలు ఉన్నాయి. విజయనగరంలో వెంకట్ బంధువులకు సమాచారం ఇవ్వగా.. మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్న విజయవాడలో రాజు కుటుంబ సభ్యులు ఎవ్వరో తెలియక పోలీసులు తర్జన బర్జన పడుతున్నారు. కాగా ఇప్పటికే రౌడీ షీటర్ కిశోర్‌పై 8 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కింది. అదే ఏడాది రౌడీషీట్ తెరిచినట్లు పోలీసులు తెలిపారు.