ఇరకాటంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు? గ్రూప్‌ 1 ఫలితాలు ఎంత పనిచేశాయ్‌..

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా ఏర్పడిన 32 మండలాలకు సైతం ఇప్పటి వరకు ఎంపీడీవో పోస్టులు మంజూరు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా ఏర్పడిన 32 మండలాలకు సైతం ఇప్పటి వరకు ఎంపీడీవో పోస్టులు మంజూరు కాలేదు. ఈ పోస్టులన్నింటినీ గ్రూపు 1 ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే కేసుల నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం నెలకొంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాత పరీక్ష ముగిసినప్పటికీ ఫలితాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. మరోవైపు స్థానిక ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉండరాదని ఎన్నికల సంఘం చెప్పడం.. ఇరకాటంలో పడేసింది.

దీంతో చేసేదిలేక కొత్త నియామకాలు జరిగేవరకు కింది స్థాయి అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తూ.. వారికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మండల పంచాయతీ అధికారులకు, మండల పరిషత్‌ సూపరింటెండెంట్లకు ఎంపీడీవోల బాధ్యతలను అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలు వెలువడి కొత్త ఎంపీడీవోలు విధుల్లో చేరే వరకు వీరు విధుల్లో కొనసాగనున్నారు.

ఆగస్టు 3న యూపీఎస్సీ సీఏపీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ 2025 రాత పరీక్ష.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2025 మరో వారంలో జరగనుంది. ఈ క్రమంలో కమిషన్‌ రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లడో చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. రాత పరీక్ష ఆగస్టు 3న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో దాదాపు 357 అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షతోపాటు ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


About Kadam

Check Also

 పీజీ ఈసెట్‌, లాసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పీజీ ఈసెట్‌ (PGECET), లాసెట్‌ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *